పుట్టి ఘటన.. ఇద్దరు మహిళల డెడ్‌బాడీలు లభ్యం

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నారాయణపేటలో విషాదం నెలకొంది. పుట్టి మునిగిన ప్రమాదంలో నలుగురు గల్లంతైనవారిలో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం ఉదయం జూరాల డ్యాంలో వారి మృతదేహాలను గుర్తించారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా, నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పస్పల వద్ద కృష్ణానదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతయ్యారు. కురవపురాని పుట్టిలో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ ప్రమాదం నుంచి తొమ్మిది మంది బయటపడగా నలుగురు […]

Update: 2020-08-18 22:36 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నారాయణపేటలో విషాదం నెలకొంది. పుట్టి మునిగిన ప్రమాదంలో నలుగురు గల్లంతైనవారిలో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం ఉదయం జూరాల డ్యాంలో వారి మృతదేహాలను గుర్తించారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

కాగా, నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పస్పల వద్ద కృష్ణానదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతయ్యారు. కురవపురాని పుట్టిలో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ ప్రమాదం నుంచి తొమ్మిది మంది బయటపడగా నలుగురు గల్లంతయ్యారు. ఈ నలుగురిలో ఓ చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News