కుమరం భీంలో ఇద్దరికి కరోనా పాజిటివ్

దిశ, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తొలిసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జైనూరుకు చెందిన ఓ వ్యక్తి గత నెలలో మర్కజ్‌కు వెళ్లివచ్చాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. కాని తన ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. వీరిని జిల్లాలోని వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి కి తరలించారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన తండ్రికి నెగిటివ్‌ రావటంతో వీరికి కరోనా ఎలా సోకిందనే […]

Update: 2020-04-10 23:56 GMT

దిశ, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తొలిసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జైనూరుకు చెందిన ఓ వ్యక్తి గత నెలలో మర్కజ్‌కు వెళ్లివచ్చాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. కాని తన ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. వీరిని జిల్లాలోని వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి కి తరలించారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన తండ్రికి నెగిటివ్‌ రావటంతో వీరికి కరోనా ఎలా సోకిందనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఇటీవల వీరి గ్రామానికి పక్కనే ఉన్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం హస్నాపూర్‌లో వీరికి సన్నిహితుడైన వ్యక్తికి పాజిటివ్ గా తేలింది. దీంతో జైనూర్ మండలాన్ని కంటైన్‌మెంట్ ఏరియాగా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా, జిల్లా వైద్యారోగ్య అధికారి కుంరం బాలు జైనూర్‌లో ఉండి సమీక్షిస్తున్నారు.

Tags: corona virus,komaram bheem,2 positive

Tags:    

Similar News