రాష్ట్రంలోనే తొలి చిన్న పిల్లల కొవిడ్ వార్డు ప్రారంభం
దిశ, ఖమ్మం : కొవిడ్ వైద్య సేవల్లో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని అగ్రస్థానంలో నిలబెట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి చిన్న పిల్లల కొవిడ్ సంరక్షణ ప్రత్యేక వార్డును ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లింగాల కమలరాజుతో కలసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. అనంతరం అక్కడి ఏర్పాడ్లను చూసి […]
దిశ, ఖమ్మం : కొవిడ్ వైద్య సేవల్లో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని అగ్రస్థానంలో నిలబెట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి చిన్న పిల్లల కొవిడ్ సంరక్షణ ప్రత్యేక వార్డును ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లింగాల కమలరాజుతో కలసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. అనంతరం అక్కడి ఏర్పాడ్లను చూసి విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..
కొవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని థర్డ్ వేవ్‌లో చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూవుతుందన్న వార్తల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా చిన్న పిల్లల కోసం మొట్టమొదటి కొవిడ్ ప్రత్యేక వార్డును 40 పడకలతో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని 550 పడకలు గా అప్‌గ్రేడ్ చేసుకున్నామని వివరించారు. 2015లో ఆక్సిజన్ బెడ్స్ లేవని, ప్రస్తుతం 300 వందల ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. గతంలో వెంటిలేటర్లు కూడా లేవని ప్రస్తుతం 35 వెంటిలేటర్లు, 5 హెచ్.ఎఫ్.ఎన్.సీలు, 10 సీపీఏపీలు, 30 మల్డీ పారా మీటర్లు, 10 కార్డియాలజీ మూనిట్స్, 10 నెప్రాలజీ యూనిట్స్, 13 కె.ఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పినట్లు మంత్రి స్పష్టంచేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర మేయర్ వునుకొల్లు నీరజ, సూడా చైర్మన్ బచ్చు విజమ్‌కుమార్, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.