అందుబాటు ధరలో ఎకో ఫ్రెండ్లీ ఎయిర్ ప్యూరిఫైర్
దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నీ ఎయిర్ పొల్యూషన్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రజలు నాణ్యతలేని, విషయవాయువులతో నిండిన గాలిని పీల్చడం వల్ల శ్వాస సమస్యలతో పాటు ఇతరత్రా జబ్బులకు గురవుతున్నారు. ఇండియాలో ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ముప్పు తీవత్ర ఎక్కువగా ఉండగా.. ఎయిర్ ప్యూరిఫైర్స్‌తో సమస్యను కొంతమేర తగ్గించే అవకాశం ఉంది. కానీ అధిక ధరల కారణంగా సామాన్యులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఓ టీనేజర్.. ఎకో ఫ్రెండ్లీ ఎయిర్ […]
దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నీ ఎయిర్ పొల్యూషన్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రజలు నాణ్యతలేని, విషయవాయువులతో నిండిన గాలిని పీల్చడం వల్ల శ్వాస సమస్యలతో పాటు ఇతరత్రా జబ్బులకు గురవుతున్నారు. ఇండియాలో ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ముప్పు తీవత్ర ఎక్కువగా ఉండగా.. ఎయిర్ ప్యూరిఫైర్స్‌తో సమస్యను కొంతమేర తగ్గించే అవకాశం ఉంది. కానీ అధిక ధరల కారణంగా సామాన్యులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఓ టీనేజర్.. ఎకో ఫ్రెండ్లీ ఎయిర్ ప్యూరిఫైర్‌ను అందరికి అందుబాటు ధరలో తయారుచేయడం విశేషం.
క్రిష్ చావ్లా ‘బ్రీతిఫై’ పేరుతో రూపొందించిన ఈ ఎయిర్ ప్యూరిఫైర్.. ‘ఎఫెక్టివ్‌నెస్, ఎకో-ఫ్రెండ్లీనెస్, నాణ్యత గల HEPA ఫిల్టర్, అందుబాటు ధర’ వంటి నాలుగు ప్రత్యేకతలను కలిగి ఉంది. దీంతో ఇప్పటిదాకా ఎయిర్ ప్యూరిఫైర్స్ విషయంలో ఎదుర్కొన్న సమస్యలకు ఇది పరిష్కారంగా కనిపిస్తుండగా.. తయారీకి సంబంధించిన అనుభవాలను వెల్లడించాడు చావ్లా. ‘బాల్యంలో శ్వాస సమస్యల వల్ల నెబ్యులైజర్స్, కార్టిసోన్ ఎక్కువగా ఉపయోగించాను. ఈ క్రమంలో నా చుట్టూ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉండేవి. అయితే వాటిల్లో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఆ మిషన్లు అన్నింటీనీ ఓపెన్ చేస్తుండేవాడిని. ఓసారి ఒక ప్యూరిఫైర్‌ను ఓపెన్ చేశాక దాని విలువ రూ.35-40 వేలు ఉంటుందని తెలిసి, ఇంత సింపుల్ మెషిన్‌కు అంత ధర ఏంటని షాకయ్యా’ అని చెప్పాడు. అందుకే తక్కువ ధరలో ఈ పరికరాన్ని తయారుచేసినట్టు వెల్లడించాడు.
ఇక ఈ19 ఏళ్ల డైనమిక్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ క్రిష్ చావ్లాను కలవడం ఆనందంగా ఉందని ట్వీట్ చేసిన నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్.. చావ్లా స్టార్టప్ ‘బ్రీతిఫై’ వంద శాతం మేకిన్ ఇండియా, నాన్ ప్లాస్టిక్ ప్రత్యేకతలతో అందుబాటు ధరల్లోనే ఎయిర్ ప్యూరిఫైర్స్‌ను తయారుచేస్తోందన్నారు. ఆత్మనిర్భర భారత్ దిశగా పయనించేందుకు ఇది ముందడుగని క్రిష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా ఈ ప్యూరిఫైర్ గురించి వివరించిన చావ్లా.. దీని ఆపరేషన్ చాలా సులభమని, కేవలం 25-65 వాట్స్ విద్యుత్‌ను మాత్రమే వాడుకుంటుందని వెల్లడించాడు. నిర్వహణ విషయానికొస్తే HEPA ఫిల్టర్‌ను మారిస్తే సరిపోతుందని పేర్కొన్నాడు. ఇప్పటివరకు 4700 యూనిట్లు విక్రయించడంతో పాటు ఓల్డ్ ఏజ్ హోమ్స్, హాస్పిటల్స్, అనాథాశ్రమాలకు 500 యూనిట్లు డొనేట్ చేసినట్టు తెలిపాడు. అంతేకాదు ఇలాంటి సంస్థలకు మరో 2000 యూనిట్లు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించాడు.
Dynamic young entrepreneur! Delighted to meet Krrish Chawla, age 19. His Start up @Breathify makes affordable air purifiers – 100% #MakeinIndia & non-plastic. A Gr8 step towards #AtmaNirbharBharat Congrats! pic.twitter.com/3E20c7P2K4
— Amitabh Kant (@amitabhk87) January 22, 2021