అంత్యక్రియల్లో పాల్గొన్న19మందికి పాజిటివ్

దిశ, వెబ్‌డెస్క్ : అంత్యక్రియల్లో పాల్గొన్న ఒకే కుటుంబానికి చెందిన 19మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ ఘటన జహీరాబాద్‌లో స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకివెళితే.. ఈ నెల 9 జహీరాబాద్‌కు చెందిన 55ఏండ్ల మహిళ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతిచెందింది. అంత్యక్రియలకు ముందు ఆమెకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. అయితే అదే రోజున దహన సంస్కారాలు నిర్వహించగా అందులో 40మందికి పైగా పాల్గొన్నారు. ఆ తర్వాత వచ్చిన రిపోర్టులో ఆ మృతురాలికి పాజిటివ్ వచ్చింది. […]

Update: 2020-06-13 02:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
అంత్యక్రియల్లో పాల్గొన్న ఒకే కుటుంబానికి చెందిన 19మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ ఘటన జహీరాబాద్‌లో స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకివెళితే.. ఈ నెల 9 జహీరాబాద్‌కు చెందిన 55ఏండ్ల మహిళ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతిచెందింది. అంత్యక్రియలకు ముందు ఆమెకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. అయితే అదే రోజున దహన సంస్కారాలు నిర్వహించగా అందులో 40మందికి పైగా పాల్గొన్నారు. ఆ తర్వాత వచ్చిన రిపోర్టులో ఆ మృతురాలికి పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్న 40మందిలో 25మంది శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించారు. శనివారం వచ్చిన రిపోర్టుల్లో ఒకే కుటుంబానికి చెందిన 19మందికి పాజిటివ్ రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.కాగా, వీరందరిని వైద్యం కోసం గాంధీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News