మొత్తం కరోనా మయం…ఏపీ @ 1833
దిశ ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా విజృంభణ ఆగడం లేదు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. విశాఖపట్టణంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి నేపథ్యంలో నేడు ఆలస్యంగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఏపీలో మొత్తం 1883 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. నిన్న తొలిసారి కర్నూలులో సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయని […]
దిశ ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా విజృంభణ ఆగడం లేదు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. విశాఖపట్టణంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి నేపథ్యంలో నేడు ఆలస్యంగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఏపీలో మొత్తం 1883 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రకటించింది.
నిన్న తొలిసారి కర్నూలులో సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కృష్ణా జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ జిల్లాలో 16 మందికి కొత్తగా కరోనా సోకిందని చెప్పింది. ఆ తరువాతి స్థానంలో గుంటూరు జిల్లాదేనని తెలిపింది. ఈ జిల్లాలో పది మందికి కరోనా సోకినట్టు చెప్పింది. కడపలో 6, కర్నూలులో 7, నెల్లూరులో 4, విశాఖపట్నంలో 7, అనంతపురంలో 3 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.
నిన్నటి వరకు గ్రీన్ జోన్‌లో ఉన్న విజయనగరం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రకటించింది. ఈ కేసులు ఎలా నమోదయ్యాయన్న విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. విజయనగరం జిల్లాలో మూడు కేసులు నమోదు కావడంతో ఏపీ మొత్తానికి కరోనా సోకినట్టైంది.
ఏపీలో గత 24గంటల్లో 8,087 శాంపిళ్లను పరీక్షించగా 56 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపీలో మొత్తం 1833 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1015 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 780 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా 38 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలులో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
Tags: corona positive, covid-19, coronavirus, health department, 1833 corona positive cases in ap state