180 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

దిశ, క్రైమ్ బ్యూరో: చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహేద్‌నగర్‌లో 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాహేద్ నగర్‌లో స్థానికుల నుంచి రేషన్ బియ్యాన్ని రూ.10 లకు కొనుగోలు చేసి, స్టాక్ ఉంచుతూ.. తిరిగి రూ.12 కు, ఇతర ప్రాంతాల్లో రూ.15కు విక్రయిస్తున్నారు. బియ్యం నిల్వ స్థావరంపై దాడి చేసి 180 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో […]

Update: 2020-06-10 11:47 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహేద్‌నగర్‌లో 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాహేద్ నగర్‌లో స్థానికుల నుంచి రేషన్ బియ్యాన్ని రూ.10 లకు కొనుగోలు చేసి, స్టాక్ ఉంచుతూ.. తిరిగి రూ.12 కు, ఇతర ప్రాంతాల్లో రూ.15కు విక్రయిస్తున్నారు. బియ్యం నిల్వ స్థావరంపై దాడి చేసి 180 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో మహ్మద్ రిజ్వాన్, ఇర్ఫాన్, సమీ, నవాజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బియ్యాన్ని మలక్ పేట సర్కిల్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. మలక్‌పేట ఏఎస్ఓ కార్యాలయం డీటీ బాలమణి ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News