గ్రేటర్‌లో స్వింగ్ ఎవరివైపో?

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ ఎన్నికల్లో ఓట్లపై విశ్లేషణలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల అభ్యర్థులకు స్వింగ్​ ఓటర్ల (swing voters) అంశమే తేలకుండా మిగిలింది. ప్రతిసారి స్వింగ్​ ఓటర్లే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు 80 నుంచి 100 డివిజన్లలో వీరి ఓట్లే ప్రధానం. పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, సమీకరణాలను అనుగుణంగా అభిప్రాయాలను మార్చుకునే స్వింగ్​ ఓటర్లు గ్రేటర్​ ఓటర్లలో 18 శాతం వరకు ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరి ఎవరి […]

Update: 2020-11-26 23:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ ఎన్నికల్లో ఓట్లపై విశ్లేషణలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల అభ్యర్థులకు స్వింగ్​ ఓటర్ల (swing voters) అంశమే తేలకుండా మిగిలింది. ప్రతిసారి స్వింగ్​ ఓటర్లే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు 80 నుంచి 100 డివిజన్లలో వీరి ఓట్లే ప్రధానం. పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, సమీకరణాలను అనుగుణంగా అభిప్రాయాలను మార్చుకునే స్వింగ్​ ఓటర్లు గ్రేటర్​ ఓటర్లలో 18 శాతం వరకు ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరి ఎవరి పక్షాన ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. విద్యావంతులు, రాజకీయాలు, అభివృద్ధి అంచనా వేసేవారు, సమీకరణాలను చూసి గెలుపోటములు నిర్ధారించుకునే వారంతా స్వింగ్​ ఓటర్ల జాబితాలో ఉంటారు.

టీఆర్​ఎస్​కు వ్యతిరేకంగానే..?!

అన్ని పార్టీలు ఇప్పటి నుంచే పోలింగ్​ సరళిని అంచనా వేసుకుంటున్నాయి. ప్రలోభాలతో పోలయ్యే ఓట్లు కొన్నింటిని ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఆ తర్వాత సామాజిక వర్గాలు, కుల ప్రాతిపదికన, పథకాలకు ఆకర్షితులు, ఏండ్ల తరబడి ఒకే పార్టీకి మద్దతుగా ఉండే ఓటర్ల వారీగా వివరాలు సేకరించుకుంటూ గెలుపోటములను అంచనా వేసుకుంటారు. ఈ నేపథ్యంలో స్వింగ్​ ఓటర్లను మాత్రం అంచనా వేయలేకపోతున్నారు.

ప్రతిసారీ అభ్యర్థులకు అంతు చిక్కకుండా ఉండే ఓటర్లు వీరే. అయితే గత గ్రేటర్​ ఎన్నికల్లో స్వింగ్​ ఓటర్లు మొత్తం అధికార పార్టీకి అండగా నిలిచారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. దుబ్బాక పరిణామాల తర్వాత స్వింగ్​ ఓటర్లలో మార్పు వస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ విధానాలపై కొంత అసంతృప్తితోనే వ్యవహరిస్తున్నారు. గ్రేటర్​ పరిధిలో ప్రధానంగా ఎల్​ఆర్​ఎస్​, బీఆర్​ఎస్​ వంటి స్కీంలు కొంత వ్యతిరేకతను పెంచాయి. కార్పొరేటర్ల అవినీతి, అక్రమ వ్యవహారాలపై చాలా అయిష్టతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వింగ్​ ఓటర్లతో అధికార పార్టీకి కొంత ముప్పు ఉన్నట్లే భావిస్తున్నారు.

ఏ పార్టీకి లాభం..

చాలా మేరకు గెలిచే అవకాశాలున్న అభ్యర్థుల వైపు ఈ ఓటర్లు మొగ్గు చూపుతుంటారు. కానీ ప్రస్తుతం వీరి ఓట్లే వారి గెలుపునకు పునాది కానున్నాయి. టీఆర్​ఎస్​కు కచ్చితంగా ఓటేసే అవకాశం లేదని స్వింగ్​ ఓటర్లు చెప్పుతున్నారు. దీంతో వీరి ఓట్లు ఎవరికి లాభం చేకూర్చుతాయనేది సందేహంగానే మారింది. ఎల్​బీనగర్, సాగర్​ రింగ్​ రోడ్డు, బీఎన్​రెడ్డి వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్​కు లాభంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఉప్పల్​, మల్కాజిగిరి వంటి ప్రాంతాల్లో టీఆర్​ఎస్​, బీజేపీకి అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నా అధికార పార్టీపై అసంతృప్తి నెలకొనడంతో ఇతర పార్టీలకు కలిసొస్తుందని తెలుస్తోంది. మరోవైపు కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో సెటిలర్​ ఓట్లే అధికం. ఈ సెటిలర్ల ఓట్లలో స్వింగ్​ ఓట్లే ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీకి మద్దతునిస్తారో అంతుచిక్కకుండానే ఉంది. ప్రస్తుతం ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో పార్టీ ప్రచారశైలి, నేతల వ్యాఖ్యలపై కూడా అధారపడి వీరి ఓట్లు ఆధారపడి ఉంటాయని పలువురు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News