కాంక్రీట్ మిక్సర్‌లో 18 మంది వలస జీవులు

భోపాల్: లాక్‌డౌన్ కారణంగా పనిచేసే చోట చిక్కకున్న వలస కార్మికుల సొంతింటి ప్రయాణాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో వలస జీవుల దయనీయ పరిస్థితే వెలుగుచూసింది. కాంక్రీట్ మిక్సర్‌‌లో 18 మంది వలస జీవులు నక్కి యూపీలోని లక్నోకు ప్రయాణిస్తుండగా పోలీసుల కంటపడ్డారు. ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఇండోర్, ఉజ్జయిని పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన బయటపడింది. పోలీసుల ప్రశ్నలకు లారీ డ్రైవర్ బెదురుగా సమాధానాలివ్వడంతో అనుమానంతో మిక్సర్ మూత తెరవగా.. అందులో నుంచి ఒకరి వెంట […]

Update: 2020-05-02 09:27 GMT

భోపాల్: లాక్‌డౌన్ కారణంగా పనిచేసే చోట చిక్కకున్న వలస కార్మికుల సొంతింటి ప్రయాణాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో వలస జీవుల దయనీయ పరిస్థితే వెలుగుచూసింది. కాంక్రీట్ మిక్సర్‌‌లో 18 మంది వలస జీవులు నక్కి యూపీలోని లక్నోకు ప్రయాణిస్తుండగా పోలీసుల కంటపడ్డారు. ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఇండోర్, ఉజ్జయిని పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన బయటపడింది. పోలీసుల ప్రశ్నలకు లారీ డ్రైవర్ బెదురుగా సమాధానాలివ్వడంతో అనుమానంతో మిక్సర్ మూత తెరవగా.. అందులో నుంచి ఒకరి వెంట ఒకరు 18 మంది బయటకొచ్చారు. చినిగిన బట్టలతో ఒక మనిషి మాత్రమే ప్రవేశించగలిగే వెడల్పు ఉన్న మిక్సర్ హోల్ నుంచి వారు బయటికి వస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. లాక్‌డౌన్‌తో ప్రయాణ సదుపాయాల్లేక వలస జీవులు సొంతూరుకు వెళ్లాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వలస జీవుల తరలింపులపై సంబంధిత రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కేంద్రం ప్రత్యేక ట్రైన్‌లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

tags: migrants, stranded, cement mixer, madhya pradesh

Tags:    

Similar News