కరోనా కోరల్లో ప్రపంచం
కరోనా వైరస్ బారిన పడిన దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలకు పైగా మంది కరోనా బారినపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, స్పెయిన్, రష్యా దేశాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 1.12 లక్షల మందిని కరోనా పొట్టనపెట్టుకుంది. అమెరికాలో ఈ మహమ్మారి నానాటికి విస్తరిస్తోంది. మృతుల సంఖ్య 20 వేలు దాటింది. ఇక బాధితుల సంఖ్య 5.3 లక్షలుగా నమోదు అయింది. న్యూయార్క్ నగరంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు […]
కరోనా వైరస్ బారిన పడిన దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలకు పైగా మంది కరోనా బారినపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, స్పెయిన్, రష్యా దేశాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 1.12 లక్షల మందిని కరోనా పొట్టనపెట్టుకుంది. అమెరికాలో ఈ మహమ్మారి నానాటికి విస్తరిస్తోంది. మృతుల సంఖ్య 20 వేలు దాటింది. ఇక బాధితుల సంఖ్య 5.3 లక్షలుగా నమోదు అయింది. న్యూయార్క్ నగరంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. న్యూజెర్సీలో మాత్రం బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అధ్యక్షుడు ట్రంప్ దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారు.
భారత్‌లోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 736 జిల్లాల్లో 364 జిల్లాలో వైరస్ విస్తరించింది. గత నాలుగు రోజుల నుంచి దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో అధికార వర్గాల్లో కలవరం మొదలైంది. కేవలం నాలుగు రోజుల్లోనే 80కి పైగా జిల్లాలో కరోనా విస్తరించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8 వేలకు పైగా బాధితుల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 273కు చేరింది. వైరస్ నుంచి కోలుకొని 764 మంది డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రష్యాలోనూ వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,186 కేసులు నమోదయ్యాయి. ఒక్క మాస్కోలోనే 1306 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం బాధితల సంఖ్య 15,770కు చేరుకుంది. 130 మంది ప్రాణాలు విడిచారు. స్పెయిన్‌లో ఆదివారం ఒక్క రోజే 619 మంది మృతి చెందారు. పాకిస్థాన్‌లో కొత్తగా 386 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 5,170కి పెరిగింది.
Tags: carona, world, lock down, usa, spain, britan, india