క్వారంటైన్‌కు 1700 మంది జాలర్లు
జీవనోపాధి నిమిత్తం కర్ణాటక వెళ్లి చిక్కుకుపోయిన 1,700 మంది జాలర్లను నెల్లూరు జిల్లాకు తీసుకు వచ్చారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వీరంతా కర్ణాటక సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ దరిమిలా తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆంక్షల కారణంగా వారు కర్ణాటక సరిహద్దుల్లోనే ఉండిపోయారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారి వివరాలను ఆఫ్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు రాష్ట్ర మంత్రి పి అనిల్‌కుమార్ దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన […]
జీవనోపాధి నిమిత్తం కర్ణాటక వెళ్లి చిక్కుకుపోయిన 1,700 మంది జాలర్లను నెల్లూరు జిల్లాకు తీసుకు వచ్చారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వీరంతా కర్ణాటక సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ దరిమిలా తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆంక్షల కారణంగా వారు కర్ణాటక సరిహద్దుల్లోనే ఉండిపోయారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారి వివరాలను ఆఫ్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు రాష్ట్ర మంత్రి పి అనిల్‌కుమార్ దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన చొరవతో వారందర్నీ రాష్ట్రంలోకి అనుమతించిన పోలీసులు, వారిని క్వారంటైన్‌కు తరలించారు.
Tags : nellore, prakasam, fishermen, karnataka, ap, quarantaine,