విద్యుద్ఘాతంతో 17 బర్రెలు మృతి

దిశ, వరంగల్: ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో 17 బర్రెలు మృతి చెందాయి.ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని కాసిందేవి పేటలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి ఉదయం బర్రెలను మేపడానికి తన వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో ప్రమాదవశాత్తు 11 కేవీ వైరు నేలపై పడింది. కాపరి దానిని గమనించకపోవడంతో పశువులు వైరు దగ్గరికి వెళ్లి మృత్యువాత పడ్డాయి. ఈ ప్రమాదంతో సుమారు రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు రెవెన్యూ అధికారులు […]

Update: 2020-04-26 07:46 GMT

దిశ, వరంగల్: ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో 17 బర్రెలు మృతి చెందాయి.ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని కాసిందేవి పేటలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి ఉదయం బర్రెలను మేపడానికి తన వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో ప్రమాదవశాత్తు 11 కేవీ వైరు నేలపై పడింది. కాపరి దానిని గమనించకపోవడంతో పశువులు వైరు దగ్గరికి వెళ్లి మృత్యువాత పడ్డాయి. ఈ ప్రమాదంతో సుమారు రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. మరో 3 బర్రెలు గాయపడటంతో వెటర్నరీ వైద్యులు వాటికి చికిత్స అందిస్తున్నారు. పశువుల కాపరికి వాటిల్లిన నష్టానికి పరిహారం ఇప్పిస్తామని విద్యుత్ శాఖ అధికారులు హామీ ఇచ్చారు.

tags : power shock, 17 buffaloes died, accidentally, warangal

Tags:    

Similar News

టైగర్స్ @ 42..