వారికి సాయం చేసిందని.. తల్లిదండ్రుల కళ్లముందే బాలికపై 8 మంది అత్యాచారం
దిశ, వెబ్‌డెస్క్: తమ ఇంటి అమ్మాయి వేరొక అబ్బాయితో వెళ్లిపోయిందన్న కోపం.. తమ పరువు నడిరోడ్డు మీద నిలబెట్టిందన్న రోషం.. వెరసి వారిని రాక్షసులుగా మార్చింది. తమ బిడ్డ వెళ్లిపోవడానికి ఒక అమ్మాయి సహాయం చేసిందని తెలుసుకున్న వారు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. విచక్షణ మరిచి పగా, ప్రతీకారం అంటూ ఒక బాలిక జీవితాన్ని నాశనం చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలని ఓ బాలికను తన తల్లిదండ్రులు ముందే సామూహికంగా అత్యాచారం చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో […]
దిశ, వెబ్‌డెస్క్: తమ ఇంటి అమ్మాయి వేరొక అబ్బాయితో వెళ్లిపోయిందన్న కోపం.. తమ పరువు నడిరోడ్డు మీద నిలబెట్టిందన్న రోషం.. వెరసి వారిని రాక్షసులుగా మార్చింది. తమ బిడ్డ వెళ్లిపోవడానికి ఒక అమ్మాయి సహాయం చేసిందని తెలుసుకున్న వారు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. విచక్షణ మరిచి పగా, ప్రతీకారం అంటూ ఒక బాలిక జీవితాన్ని నాశనం చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలని ఓ బాలికను తన తల్లిదండ్రులు ముందే సామూహికంగా అత్యాచారం చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది
వివరాలలోకి వెళితే అమ్రోహా రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉండే కుటుంబానికి చెందిన ఒక యువకుడు, తన పక్కింటి అమ్మాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని ఇద్దరు జూన్ 27న ఊరి నుంచి వెళ్లిపోయారు. వారు వెళ్లిపోవడంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అమ్మాయి తరపున వాళ్లు యువకుడి కుటుంబ సభ్యులను ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ జంట వెళ్లిపోవడానికి యువకుడి చెల్లి(16) సాయం చేసిందని తెలుసుకున్న వారు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు.
అందరిలో తమ పరువు నడిరోడ్డుమీద పడేలా చేయడానికి హెల్ప్ చేసిన తనపై ప్రతీకారం తీర్చుకోవాలని తల్లిదండ్రుల ముందే ఆ బాలికపై 8 మంది సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా అందులో ఓ యువకుడు బలవంతంగా బాలిక మెడలో తాళికట్టి వివాహం చేసుకున్నాడు. ఈ విషయాలను బయట ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ ఆ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను హెచ్చరించి విడిచిపెట్టారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, తొలుత స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. అయితే తనపై జరిగిన దారుణాన్ని బాలిక వివరించడంతో ఆ 8 మందిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.