కెనడాలో కాల్పులు: 16 మంది మృతి

ఒట్టావా: కెనడాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. ఈ దారుణ ఘటన నోవా స్కోటియా రాష్ట్రంలో ఆదివారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసు దుస్తుల్లో వచ్చిన దుండగుడు.. ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడు కూడా మ‌ృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం.. ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. లాక్ […]

Update: 2020-04-19 22:41 GMT

ఒట్టావా: కెనడాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. ఈ దారుణ ఘటన నోవా స్కోటియా రాష్ట్రంలో ఆదివారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసు దుస్తుల్లో వచ్చిన దుండగుడు.. ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడు కూడా మ‌ృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం.. ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా జనసంచారం ఎక్కవగా లేకపోవడంతో ప్రాణనష్టం తగ్గిందని అధికారులు వెల్లడించారు.

గత 30 ఏళ్లలో కెనడాలో ఇలాంటి దారుణ ఘటన జరగలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది చనిపోవడంతో అప్పటి నుంచీ ఆ దేశంలో తుపాకుల వాడకంపై కఠిన ఆంక్షలు విధించారు.

Tags: canada, Assailant, firing, nova scotia

Tags:    

Similar News