జీహెచ్ఎంసీలో కరోనా కలకలం.. మరో16 మందికి పాజిటివ్
దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా బారిన పడ్డా వారి సంఖ్య పదహారుకు చేరుకుంది. తాజాగా శనివారం జీహెచ్ఎంసీ ఐటీ విభాగంలోని ఓ మహిళా ఉద్యోగినికి కరోనా పాజిటివ్ వచ్చింది. సదరు ఉద్యోగిని అధికారులు ఇంటికి పంపించారు. గత 15 రోజుల్లోపై బల్దియాలో 16 మందిలో కరోనా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా బారిన పడ్డా వారి సంఖ్య పదహారుకు చేరుకుంది. తాజాగా శనివారం జీహెచ్ఎంసీ ఐటీ విభాగంలోని ఓ మహిళా ఉద్యోగినికి కరోనా పాజిటివ్ వచ్చింది. సదరు ఉద్యోగిని అధికారులు ఇంటికి పంపించారు. గత 15 రోజుల్లోపై బల్దియాలో 16 మందిలో కరోనా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ సూచనలు ఇచ్చినప్పటికీ కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఇంకా ప్రారంభించలేదు. కేసుల తీవ్రత పెరిగితే గ్రేటర్‌లో తొలి వరుసలో ఉండి పనిచేయాల్సింది జీహెచ్ఎంసీ ఉద్యోగులే. కరోనా బల్దియా సిబ్బందికే సోకుతుండటంతో.. భవిష్యత్‌లో మరింత ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి.