పిడుగుతో సెల్ఫీ ట్రై చేశారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
దిశ, వెబ్‌డెస్క్ : సెల్ఫీ అత్యుత్సాహం వారి ప్రాణాలను బలి తీసుకుంది. వర్షం పడుతున్న సమయంలో పిడుగును సెల్ఫీ తీసుకుందామనుకున్న ఘటనలో 16 మంది మృతి చెందారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జైపూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం వర్షం కురుస్తుండగా జైపూర్‌లోని అమర్ ప్యాలెస్‌ను సందర్శిస్తున్న వాళ్లలో కొందరు ఆనందంతో క్లాక్‌టవర్‌పైకి ఎక్కారు. ఈ క్రమంలో వారంతా సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అదే సందర్భంలో సడెన్‌గా టవర్‌పై పిడుగుపడింది. పిడుగు పడిన సెకన్ల […]
దిశ, వెబ్‌డెస్క్ : సెల్ఫీ అత్యుత్సాహం వారి ప్రాణాలను బలి తీసుకుంది. వర్షం పడుతున్న సమయంలో పిడుగును సెల్ఫీ తీసుకుందామనుకున్న ఘటనలో 16 మంది మృతి చెందారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జైపూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం వర్షం కురుస్తుండగా జైపూర్‌లోని అమర్ ప్యాలెస్‌ను సందర్శిస్తున్న వాళ్లలో కొందరు ఆనందంతో క్లాక్‌టవర్‌పైకి ఎక్కారు. ఈ క్రమంలో వారంతా సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
అదే సందర్భంలో సడెన్‌గా టవర్‌పై పిడుగుపడింది. పిడుగు పడిన సెకన్ల వ్యవధిలో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందారు. పిడుగు పడిందన్న కంగారులో కొందరు టవర్ పక్కనే ఉన్న హిల్ స్టేషన్ ఫారెస్ట్‌లోకి జంప్ చేశారు. ఈ క్రమంలో మరికొంత మంది చనిపోయారు. ఇక, ఈ ఘటనలో ఇప్పటిదాకా 16 మంది మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలే ఉండటం విషాదం. అయితే, ఈ ప్రమాదంతో మరో 29 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.
#Rajasthan | "With the help of locals, we rescued around 29 people from the Amer Fort area after lightning struck them. They were taken to the hospital. Of these, 16 people have died," Anand Srivastava, Police Commissioner, Jaipur said yesterday
Visuals from the spot. pic.twitter.com/4RJLOJ661E
— ANI (@ANI) July 11, 2021