భారత్ కరోనా @ 29,435
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,543 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 29,435కు చేరింది. సోమవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 64 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 943కు చేరింది. ఇప్పటి వరకు 6,869 మంది బాధితులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారు 23.33 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ […]
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,543 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 29,435కు చేరింది. సోమవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 64 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 943కు చేరింది. ఇప్పటి వరకు 6,869 మంది బాధితులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారు 23.33 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా, సోమవారం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్‌లో కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మే 3 తరువాత కూడా లాక్‌డౌన్ కొనసాగవచ్చని ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తూనే కరోనాపై పోరాటం కొనసాగించాలని సీఎంలను కోరారు. ఇక, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మే 3 తరువాత ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Tags: corona, india, single day cases 1543, total cases 29,435, hotspots, pm modi