చైనాలో మరో 1500 పడకల ఆస్పత్రి నిర్మాణం
దిశ, వెబ్‌డెస్క్ : డ్రాగన్ కంట్రీలో కొత్తగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఏయే రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయో అక్కడ మరోసారి లాక్‌డౌన్ విధించింది. అంతేకాకుండా మరో 1500 పడకల ఆస్పత్రి నిర్మాణానికి రంగం సిద్దం చేసింది. చైనాలో ఐదురోజుల వ్యవధిలోనే కరోనా కేసులు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాంగాంగ్ హెబీ ప్రావిన్స్‌లో ఈ […]
దిశ, వెబ్‌డెస్క్ : డ్రాగన్ కంట్రీలో కొత్తగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఏయే రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయో అక్కడ మరోసారి లాక్‌డౌన్ విధించింది. అంతేకాకుండా మరో 1500 పడకల ఆస్పత్రి నిర్మాణానికి రంగం సిద్దం చేసింది. చైనాలో ఐదురోజుల వ్యవధిలోనే కరోనా కేసులు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నాంగాంగ్ హెబీ ప్రావిన్స్‌లో ఈ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. అక్కడే మరో 5 హాస్పిటళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇదిలాఉండగా, గతేదాడి వుహాన్ సిటీలో కరోనా కేసులు భారీగా వెలుగుచూసిన సమయంలో కేవలం 10 రోజుల వ్యవధిలో చైనా 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.