వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ విజేతగా భారత సంతతి బాలిక

దిశ, ఫీచర్స్ : కోడింగ్‌ నైపుణ్యంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్రదర్శించేందుకు యువ ప్రతిభావంతులకు అద్భుతమైన వేదిక ‘డబ్ల్యూడబ్ల్యుడీసీ(Worldwide Developers Conference)’. టెక్ దిగ్గజం యాపిల్ నిర్వహించే ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు హాజరవుతుంటారు. పాండమిక్ కారణంగా వర్చువల్‌గా జరుగుతున్న పోటీల్లో 35 దేశాలకు చెందిన 350 స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ స్విఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్‌లో ఫైనల్‌గా ముగ్గురు విజేతలు ఎంపికవగా, అందులో ఒకరు భారతీయ సంతతి అభినయ దినేష్(15 సం.,) ఉండటం విశేషం. […]

Update: 2021-06-02 03:53 GMT

దిశ, ఫీచర్స్ : కోడింగ్‌ నైపుణ్యంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్రదర్శించేందుకు యువ ప్రతిభావంతులకు అద్భుతమైన వేదిక ‘డబ్ల్యూడబ్ల్యుడీసీ(Worldwide Developers Conference)’. టెక్ దిగ్గజం యాపిల్ నిర్వహించే ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు హాజరవుతుంటారు. పాండమిక్ కారణంగా వర్చువల్‌గా జరుగుతున్న పోటీల్లో 35 దేశాలకు చెందిన 350 స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ స్విఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్‌లో ఫైనల్‌గా ముగ్గురు విజేతలు ఎంపికవగా, అందులో ఒకరు భారతీయ సంతతి అభినయ దినేష్(15 సం.,) ఉండటం విశేషం.

విజేతలుగా నిలిచిన ముగ్గురు యువతులు కూడా ప్రపంచం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే కాకుండా, తరువాతి తరాన్ని కూడా ఇన్‌స్పైర్ చేశారు. ఈ క్రమంలోనే భారతీయ – అమెరికన్ విద్యార్థి అభినయ దినేష్.. ‘గ్యాస్ట్రో ఎట్ హోమ్’ అనే యాప్‌ను సృష్టించినందుకు గాను విజేతల్లో ఒకరిగా నిలిచింది. ఈ వేసవిలోనే యాప్ స్టోర్‌లో దీన్ని ప్రారంభించాలని ఆమె యోచిస్తుండగా.. తన సొంత అనుభవాలే ఈ యాప్ రూపకల్పనకు ప్రేరణగా నిలిచాయి. మెడిసిన్‌, టెక్నాలజీపై మక్కువ చూపే అభినయ.. ఈ రెండింటిలో పట్టు సాధించి, గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలనుకుంటోంది. కాగా అభినయతో పాటు హవాయికి చెందిన 16 ఏళ్ల జియానా యాన్, వర్జీనియాకు చెందిన 17 ఏళ్ల డామిలోలా అవోఫిసాయో కూడా విజేతలుగా నిలిచారు.

యువతుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన కల్పించడానికి అభినయ ‘ఇంపాక్ట్ ఏఐ’ పేరుతో ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కూడా ప్రారంభించింది. అందులో భాగంగా ప్రోగ్రామింగ్‌తో పాటు మెషిన్ లెర్నింగ్ నేర్పించడానికి ‘గర్ల్స్ ఇన్ AI’ అనే ఎనిమిది వారాల హైస్కూల్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసింది. ఈ సాంకేతికతతో అద్భుతాలు చేయొచ్చని.. మెడిసిన్ రంగం, సమాజంలో భారీ పురోగతికి ఇది దారితీస్తుందని, నెక్ట్స్ జనరేషన్‌కు నేర్పించడం చాలా ముఖ్యమని అభినయ భావిస్తోంది. వైద్యరంగాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, దాని ద్వారా కొత్త మార్గాలను కనుగొనవచ్చని తను అభిప్రాయపడింది. అభినయ ప్రస్తుతం న్యూజెర్సీలోని నార్త్ బ్రున్‌స్విక్‌లో నివసిస్తోంది.

‘ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వద్దకు వెళ్ళాను. నన్ను పరీక్షించిన వైద్యులు, పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారించారు. కాని ఆ సమస్య ఏంటి, దాన్నుంచి ఎలా బయటపడాలో చెప్పలేదు. దాంతో నాకు ఓ ఆలోచన కలిగింది. నాలాగే చాలామంది ఇలాంటి వ్యాధితో బాధపడుతుంటారని, వారి కోసం ఓ యాప్ రూపొందించాలని నిర్ణయించుకున్నాను. ఆ ఆలోచనే ‘గ్యాస్ట్రో ఎట్ హోమ్’ అనే యాప్. ఇది జీర్ణశయాంతర రుగ్మత ఉన్నవారికి సమాచారం అందించడంతో పాటు అందుబాటులో ఉన్న రిసోర్సెస్ వివరాలు అందిస్తుంది. ప్రత్యేకించి ప్రజలు మాట్లాడటానికి సౌకర్యంగా లేని కొన్ని పరిస్థితుల గురించి ఇందులో ప్రస్తావించాం’ అని అభినయ వెల్లడించింది.

Tags:    

Similar News