బెంగాల్‌లో భారీ వర్షాలు.. 15 మంది మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం కురిసిన వర్షాలకు తోడు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని పంచట్, మైథాన్ బ్యారేజ్‌ల నుంచి నీటిని భారీగా విడుదల చేశారు. దీంతో భారీగా వచ్చిన వరద నీటితో ఆరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పూర్వవర్ధమాన్, పశ్చిమ వర్థమాన్, పశ్చిమ మేథిని పూర్, హుగ్లీ, హౌరా, 24 దక్షిణ పరిగణాలు జలదిగ్బంధమైనట్టు అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో భారీ వరదల వల్ల 15 మంది […]
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం కురిసిన వర్షాలకు తోడు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని పంచట్, మైథాన్ బ్యారేజ్‌ల నుంచి నీటిని భారీగా విడుదల చేశారు. దీంతో భారీగా వచ్చిన వరద నీటితో ఆరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పూర్వవర్ధమాన్, పశ్చిమ వర్థమాన్, పశ్చిమ మేథిని పూర్, హుగ్లీ, హౌరా, 24 దక్షిణ పరిగణాలు జలదిగ్బంధమైనట్టు అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో భారీ వరదల వల్ల 15 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. లక్షల మంది నిరాశ్రయులైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
మమతకు మోడీ ఫోన్
బెంగాల్‌లో వరదల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీకి ప్రధాని మోడీ బుధవారం ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై మమతను అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాన్ని ఎదుర్కోవడంలో కేంద్రం నుంచి సంపూర్ణ సహాయం అందిస్తామని తెలిపినట్టు పీఎంవో తెలిపింది.