రేపటి నుంచి 144 సెక్షన్

దిశ, క్రైమ్ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం ఆదివారంతో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పలు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను సీపీ శనివారం పరిశీలించారు. కొత్తపేట్ విక్టోరియ మెమోరియల్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ స్కూల్, రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్, నాచారం శ్రీచైతన్య […]

Update: 2020-11-28 10:12 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం ఆదివారంతో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పలు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను సీపీ శనివారం పరిశీలించారు. కొత్తపేట్ విక్టోరియ మెమోరియల్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ స్కూల్, రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్, నాచారం శ్రీచైతన్య హైస్కూల్ లలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కౌంటింగ్ సెంటర్లను పరిలించారు.

అనంతరం ఎన్నికల అబ్జర్వర్ ఐఏఎస్ అధికారిణి దేవసేనతో కాప్రాలో డీఆర్‌సీ కేంద్రాన్ని పర్యవేక్షించారు. సీసీ టీవీల ఇన్‌స్టాలేషన్, బారికేడ్లు, ట్రాఫిక్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పకడ్భందీ బందోబస్తుతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ… రాచకొండ కమిషనరేట్ పరిధిలో 8వేల పోలీసులతో బందోబస్తు చర్యలు చేపడుతున్నామని అన్నారు. డిసెంబరు 1న జరిగే గ్రేటర్ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ సంయుక్తంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News