70 వేలకు పైగా ఫోన్లు రికవరీ.. సీఈఐఆర్ పోర్టల్ వినియోగంలో తెలంగాణ రెండవ స్థానం
తెలంగాణ వ్యాప్తంగా భారీ మొత్తంలో సెల్ఫోన్లను పోలీసులు శనివారం రికవరీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వ్యాప్తంగా భారీ మొత్తంలో సెల్ఫోన్లను పోలీసులు శనివారం రికవరీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చోరీకి గురైన 70,058 మొబైల్ఫోన్లను పోలీసు శాఖ రికవరీ చేసింది. వీటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10,861, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9259 , రాచకొండ కమిషనరేట్ పరిధిలో 7488 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఈఐఆర్పోర్టల్ సహయంతో సీఐడీ 70,058 ఫోన్ల రికవరీ చేయడంలో సక్సెస్అయ్యారు. సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) మొబైల్ చోరీలను చేధించేందుకు అభివృద్ధి చేశారు.
తెలంగాణలోని మొత్తం 780 పోలీస్ స్టేషన్‌లలో సీఈఐఆర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే చోరీకి గురైన ఫోన్ల గుర్తింపునకు వినియోగిస్తున్న సీఈఐఆర్ దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది. ఈ సీఈఐఆర్ద్వారా తెలంగాణలో ప్రస్తుతం రోజుకు సగటున 98.67 మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తోంది. కాగా, ఈ ఫోన్ల రికవరీలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐడీ అధికారులు బి.గంగారం, సైబర్ క్రైమ్సీఐడీ, అలాగే, ఎల్ఓపీ హేమంత్ రాథ్వే(డీడీజీ సెక్యూరిటీ)తో సహా డీఓటీ అధికారులు, ఐటీ సెల్అరవింద్ కుమార్ (డైరెక్టర్ సెక్యూరిటీ). నంబి మృదుపాణి (జేటీఓసెక్యూరిటీ) ల పనితీరును సీఐడీ డీజీ శిఖా గోయెల్ అభినందించారు.