బాలుడి ప్రాణం తీసిన పబ్జీ గేమ్
దిశ, వెబ్‌డెస్క్: పబ్జీ గేమ్ ఓ పసివాడి ప్రాణం తీసింది. పబ్జీ ఆడొద్దు అన్నందుకే ఓ 14 బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులు గంటల తరబడి పబ్జీ ఆడుతున్నాడని తల్లి బాలుడిని మందలించింది. ఇంకోసారి ఆడకూడదు అంటూ హెచ్చరించింది. దీనికి మనస్థాపం చెందిన ఆ బాలుడు తనువు చాలించాడు. ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. […]
దిశ, వెబ్‌డెస్క్: పబ్జీ గేమ్ ఓ పసివాడి ప్రాణం తీసింది. పబ్జీ ఆడొద్దు అన్నందుకే ఓ 14 బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులు గంటల తరబడి పబ్జీ ఆడుతున్నాడని తల్లి బాలుడిని మందలించింది. ఇంకోసారి ఆడకూడదు అంటూ హెచ్చరించింది. దీనికి మనస్థాపం చెందిన ఆ బాలుడు తనువు చాలించాడు. ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పబ్జీ మాయలో పడి ప్రాణాలు తీసుకున్నాడని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.