మంచిర్యాల జిల్లాలో ఒక్క రోజే 14 కేసులు

దిశ, మంచిర్యాల: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. మొన్నటి దాక బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, జన్నారం ప్రాంతాలను వణికించిన వైరస్​ ఇప్పుడు జిల్లా కేంద్రానికి పాకింది. రోజురోజుకూ పాజిటివ్​ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని ప్రముఖ టెక్స్​టైల్​ వ్యాపారి కుటుంబంలో ఇద్దరితో పాటు వారి డ్రైవర్​కు కరోనా సోకింది. ప్రస్తుతం ఇద్దరు హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. జిల్లా నుంచి మూడు రోజుల క్రితం పంపిన 28 శాంపిల్స్‌లో శనివారం 14 పాజిటివ్‌గా […]

Update: 2020-06-28 09:07 GMT

దిశ, మంచిర్యాల: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. మొన్నటి దాక బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, జన్నారం ప్రాంతాలను వణికించిన వైరస్​ ఇప్పుడు జిల్లా కేంద్రానికి పాకింది. రోజురోజుకూ పాజిటివ్​ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని ప్రముఖ టెక్స్​టైల్​ వ్యాపారి కుటుంబంలో ఇద్దరితో పాటు వారి డ్రైవర్​కు కరోనా సోకింది. ప్రస్తుతం ఇద్దరు హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. జిల్లా నుంచి మూడు రోజుల క్రితం పంపిన 28 శాంపిల్స్‌లో శనివారం 14 పాజిటివ్‌గా తేలాయి.

హాస్పిటల్​ నిర్లక్ష్యంతో 9మందికి..

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​ నిర్లక్ష్యంతో తొమ్మిది మంది సిబ్బంది వైరస్​ బారిన పడ్డారు. ఇటీవల బెల్లంపల్లికి చెందిన ఓ వ్యక్తి ఈ హాస్పిటల్​లో వైద్యం చేయించుకున్నాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​ వెళ్లగా అక్కడ కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ విషయం తెలిసినప్పటికీ బెల్లంపల్లి హాస్పిటల్​ను యథావిధిగా నిర్వహించారు. దీంతో హాస్పిటల్​లో పనిచేసే డాక్టర్​కు పాజిటివ్​ వచ్చింది. అధికారులు హాస్పిటల్​ను మూసివేసి స్టాఫ్​కు టెస్టులు నిర్వహించారు. ఏకంగా తొమ్మిది మందికి వైరస్​ సోకినట్లు తేలింది.

అలాగే పట్టణంలోని ఓ మెడికల్​ షాపు యజమాని ద్వారా ఆయన కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్​ వచ్చింది. మరో యువకుడు వైరస్​ బారినపడ్డాడు. వీరందరిని బెల్లంపల్లి ఐసోలేషన్​ సెంటర్​కు తరలించారు. జిల్లాలో శనివారం నమోదైన కేసులతో మొత్తంగా 85కు చేరాయి. వీటిలో 37 మైగ్రెంట్​ కేసులు కాగా, మరో రెండు మైగ్రెంట్​ కాంటాక్ట్​ ద్వారా వచ్చాయి. అలాగే 16 లోకల్​ కేసులు, లోకల్​ కాంటాక్ట్​ ద్వారా మరో 24 కేసులు కూడా రికార్డయ్యాయి. ఇతర జిల్లాల్లో ఉంటున్నవారిలో ఆరు కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు గాంధీ హాస్పిటల్​ నుంచి 42 మంది, బెల్లంపల్లిలోని ఐసోలేషన్​ సెంటర్​ నుంచి ఏడుగురు, మొత్తం 49 మంది డిశ్చార్జ్​ అయ్యారు. మరో 47 శాంపిల్స్​ రిపోర్టులు రావాల్సి ఉంది.

Tags:    

Similar News