13 వేల మొబైల్ ఫోన్లు.. సింగిల్ ఐఎమ్ఈఐ నెంబర్.

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు ఇంటర్నేషనల్ మొబైల్ స్టేషన్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎమ్ఈఐ) నెంబర్ తప్పనిసరిగా ఉంటుంది. మొబైల్ పోయినప్పడు.. ఫోన్ ఎక్కడుందో ట్రేస్ చేయడానికి ‘ఐఎమ్ఈఐ నెంబర్’ చాలా ఇంపార్టెంట్. ఏ మోడల్ ఫోన్‌లో అయినా సరే *#06#’కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన ఫోన్ ‘ఐఎమ్ఈఐ’ నెంబరును తెలుసుకోవచ్చు. అంతేకాదు.. ఎవరైనా ఫోన్ దొంగిలించినప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇవ్వాలన్నా.. ఎఫ్ఐఆర్ లో .. మొబైల్ ఐఎమ్ఈఐ నెంబర్‌ను తప్పనిసరిగా […]

Update: 2020-06-05 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు ఇంటర్నేషనల్ మొబైల్ స్టేషన్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎమ్ఈఐ) నెంబర్ తప్పనిసరిగా ఉంటుంది. మొబైల్ పోయినప్పడు.. ఫోన్ ఎక్కడుందో ట్రేస్ చేయడానికి ‘ఐఎమ్ఈఐ నెంబర్’ చాలా ఇంపార్టెంట్. ఏ మోడల్ ఫోన్‌లో అయినా సరే *#06#’కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన ఫోన్ ‘ఐఎమ్ఈఐ’ నెంబరును తెలుసుకోవచ్చు. అంతేకాదు.. ఎవరైనా ఫోన్ దొంగిలించినప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇవ్వాలన్నా.. ఎఫ్ఐఆర్ లో .. మొబైల్ ఐఎమ్ఈఐ నెంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐఎమ్ఈఐ నెంబర్ లేని మొబైల్ ఫోన్లను అమ్మడాన్ని భారత ప్రభుత్వం నిషేదించింది కూడా. అయితే.. ఓ ప్రముఖ మొబైల్ ఫోన్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ 13 వేల ఐదు వందల ఫోన్లకు సేమ్ ఐఎమ్ఈఐ నెంబర్లను ప్రొవైడ్ చేయడంతో .. మీరట్ పోలీసులు సదరు కంపెనీపై కేస్ బుక్ చేశారు. ఓ పోలీస్ .. తన మొబైల్ ఫోన్ సరిగా పనిచేయకపోవడంతో.. సైబర్ క్రైమ్ సెల్ డిపార్ట్ మెంట్ కి ఇచ్చాడు. అయితే సేమ్ తన ఐఎమ్ఈఐ నెంబర్ పైనే దాదాపు 13, 500 మొబైల్ ఫోన్లు వర్క్ అవుతున్నట్లు తెలియడంతో షాక్ కు గురయ్యాడు. ‘ఇది పూర్తిగా కంపెనీ నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, క్రిమినల్స్ ఈ మొబైల్స్ ను తమ అడ్వాంటేజ్ కోసం వాడుకుంటారని ’ మీరట్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ సింగ్ తెలిపారు.

Tags:    

Similar News