రూ.13 లక్షల గుట్కా పట్టివేత
దిశ, వరంగల్: వరంగల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి రూ.13లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..హన్మకొండ ఇందిరానగర్‌కు చెందిన తాటి కుమార్ గుట్కా విక్రయాలకు పాల్పడుతున్నాడనే సమాచారం మేరకు అతని ఇంటిపై దాడి చేసి 10బ్యాగులు సీజ్ చేశారు.అనంతరం కాజీపేట దర్గా రోడ్డులో ఇన్నోవా వాహనాన్ని ఆపి తనిఖీలు జరపగా, మరో 10గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. కారులోని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు […]
దిశ, వరంగల్: వరంగల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి రూ.13లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..హన్మకొండ ఇందిరానగర్‌కు చెందిన తాటి కుమార్ గుట్కా విక్రయాలకు పాల్పడుతున్నాడనే సమాచారం మేరకు అతని ఇంటిపై దాడి చేసి 10బ్యాగులు సీజ్ చేశారు.అనంతరం కాజీపేట దర్గా రోడ్డులో ఇన్నోవా వాహనాన్ని ఆపి తనిఖీలు జరపగా, మరో 10గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. కారులోని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు శివనగర్‌కు చెందిన దొంతుల రమేష్ ఇంటిపై దాడులు చేయగా 6బ్యాగుల గుట్కాను పట్టుకున్నారు.అనంతరం రెండు కార్లు సీజ్ చేసి, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.