బ్యాంకులకు ‘నకిలీ’ల బెడద.. 12 మంది అరెస్టు

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. డిజిటల్ నుంచి మాన్యువల్ వరకు అన్ని సర్వీసుల్లో నకిలీ వ్యక్తులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఓటీపీ నుంచి నకిలీ పాస్ పుస్తకాలు, రబ్బరు స్టాంపులను ఆధారంగా చేసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలో బ్యాంకులకు టోకరా వేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి రుణాలు పొందుతున్న సుమారు 10 మంది ముఠా […]

Update: 2021-03-19 07:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. డిజిటల్ నుంచి మాన్యువల్ వరకు అన్ని సర్వీసుల్లో నకిలీ వ్యక్తులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఓటీపీ నుంచి నకిలీ పాస్ పుస్తకాలు, రబ్బరు స్టాంపులను ఆధారంగా చేసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలో బ్యాంకులకు టోకరా వేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది.

నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి రుణాలు పొందుతున్న సుమారు 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేయగా, మరో ఐదుగురు నిందితులు తప్పించుకున్నట్లు సమాచారం. వీరి నుంచి రూ.5.55 లక్షలు, నకిలీ పాస్ పుస్తకాలు, రబ్బర్ స్టాంప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రామగుండం కమిషనరేట్ కార్యాలయం వెల్లడించింది.

Tags:    

Similar News