అరుదైన తాబేలును దత్తత తీసుకున్న హైదరాబాద్ జంట

దిశ, ఫీచర్స్ : కొవిడ్ సంక్షోభం వల్ల ప్రపంచంలోని దేశాలన్నీ అతలాకుతలం కాగా, ఇప్పుడిప్పుడే అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు వైరస్‌పై అవగాహన పెరగడంతో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ టూరిస్ట్ ప్లేసెస్‌ విజిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్ పార్క్‌‌కు వచ్చే విజిటర్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సరోజాదేవి-ఆశిశ్ కుమార్ దంపతులు ఫ్యామిలీతో కలిసి పార్క్‌ను సందర్శించారు. […]

Update: 2021-02-28 07:55 GMT

దిశ, ఫీచర్స్ : కొవిడ్ సంక్షోభం వల్ల ప్రపంచంలోని దేశాలన్నీ అతలాకుతలం కాగా, ఇప్పుడిప్పుడే అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు వైరస్‌పై అవగాహన పెరగడంతో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ టూరిస్ట్ ప్లేసెస్‌ విజిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్ పార్క్‌‌కు వచ్చే విజిటర్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సరోజాదేవి-ఆశిశ్ కుమార్ దంపతులు ఫ్యామిలీతో కలిసి పార్క్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా నెహ్రూ జూపార్క్‌లోని అరుదైన వన్యప్రాణి ‘గలపగొస్ జియాంట్(Galapagos Giant)’ రకానికి చెందిన 121 ఏళ్ల వయసుగల రెండు తాబేళ్లను దత్తత తీసుకున్నారు. సరోజాదేవి కుటుంబసభ్యులు ఈ మేరకు నెహ్రూ జూ పార్కు అధికారులకు రూ.30 వేల చెక్కును అందజేశారు. కొవిడ్ కారణంగా కొన్ని రోజులపాటు పార్క్ మూసివేయడం వల్ల ఆదాయం తగ్గిందన్న జూ అధికారులు.. వన్యప్రాణుల దత్తతకు ముందుకొచ్చి ఆర్థికంగా చేయూతనివ్వడం అభినందనీయమని కొనియాడారు.

Tags:    

Similar News