12 స్కూల్ బస్సుల సీజ్- వెహికల్ ఇన్‌స్పెక్టర్
దిశ రాజేంద్రనగర్ : పాఠశాలలు ప్రారంభమైన వేళ రవాణశాఖ అధికారలు కొరడ ఝులిపించారు. నిబంధనలు పాటించని 12 పాఠశాల బస్సులను సీజ్ చేశారు. నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరిగే బస్సులపై చర్యలు తప్పవని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. కరోనా కారణంగా గత సంవత్సర కాలంగా మూతబడ్డ స్కూళ్లు, ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం నుంచి ప్రారంభం కావడంతో రవాణాశాఖ అధికారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్, రాజేంద్రనగర్‌లలో స్కూల్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు పాటించకుండా […]
దిశ రాజేంద్రనగర్ : పాఠశాలలు ప్రారంభమైన వేళ రవాణశాఖ అధికారలు కొరడ ఝులిపించారు. నిబంధనలు పాటించని 12 పాఠశాల బస్సులను సీజ్ చేశారు. నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరిగే బస్సులపై చర్యలు తప్పవని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. కరోనా కారణంగా గత సంవత్సర కాలంగా మూతబడ్డ స్కూళ్లు, ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం నుంచి ప్రారంభం కావడంతో రవాణాశాఖ అధికారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్, రాజేంద్రనగర్‌లలో స్కూల్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
నిబంధనలు పాటించకుండా స్కూల్ బస్సులు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యం స్కూల్లో నడుస్తున్నా బస్సులను అన్ని పత్రాలను క్లియర్‌గా ఉంచుకోవాలని ఎప్పటికప్పుడు ఫిట్నెస్, ఫార్మేట్, ట్యాక్సులు చెల్లించాలన్నారు. బస్సులో విద్యార్థులకు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించేలా స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. బస్సులలో సిట్టింగ్ కెపాసిటీ మించి విద్యార్థులను పట్టించుకోకుండా తరలిస్తే చర్యలు తప్పవన్నారు. డ్రైవర్, క్లీనర్ తప్పనిసరిగా బస్సులో యూనిఫామ్ తో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.