క్వారంటైన్‌లోకి 12 మంది జర్నలిస్టులు

దిశ, న్యూస్ బ్యూరో : మహారాష్ట్రలో 53, చైన్నైలో 30 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో ఇప్పటికి ఆ ప్రమాదం లేకున్నా పాజిటివ్ పేషెంట్లకు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులోకి వెళ్ళిన పన్నెండు మంది జర్నలిస్టులు ప్రభుత్వ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. పద్నాలుగు రోజుల వరకు వారక్కడే ఉండాల్సి ఉంటుంది. గద్వాల జిల్లాలో ఇటీవలే ఒక అధికార పార్టీ నాయకులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ పన్నెండు మంది జర్నలిస్టులూ పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన […]

Update: 2020-04-21 19:50 GMT

దిశ, న్యూస్ బ్యూరో : మహారాష్ట్రలో 53, చైన్నైలో 30 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో ఇప్పటికి ఆ ప్రమాదం లేకున్నా పాజిటివ్ పేషెంట్లకు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులోకి వెళ్ళిన పన్నెండు మంది జర్నలిస్టులు ప్రభుత్వ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. పద్నాలుగు రోజుల వరకు వారక్కడే ఉండాల్సి ఉంటుంది. గద్వాల జిల్లాలో ఇటీవలే ఒక అధికార పార్టీ నాయకులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ పన్నెండు మంది జర్నలిస్టులూ పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన నాయకుడు అప్పటికే ఒక పాజిటివ్ పేషెంట్‌తో తెలియకుండా కాంటాక్టులోకి వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆ నాయకుడు మూడు రోజుల క్రితమే క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. దానికి కొనసాగింపుగా ఆయనతో కాంటాక్టులోకి వెళ్లిన ఈ పన్నెండు మంది ఇప్పుడు క్వారంటైన్‌లోకి వెళ్ళాల్సి వచ్చింది. కాగా, ఆ నాయకుడు హోమ్ క్వారంటైన్‌లో ఉంటే, వీరిని మాత్రం మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో క్వారంటైన్‌లో ఉంచారు. అవసరమైతే వీరికి పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ వస్తే ఇళ్ళకు పంపుతారు. లేదంటే ఐసోలేషన్ తప్పదు. పన్నెండు మంది జర్నలిస్టుల్లో ఎనిమిది మంది టీవీ ఛానెళ్ళ రిపోర్టర్లు కాగా మరో నలుగురు వీడియో జర్నలిస్టులు.

Tags: Telangana, Corona, Quarantine, Journalists, Gadwal

Tags:    

Similar News