చౌటుప్పల్‌లో 12 కరోనా కేసులు నమోదు

దిశ, మునుగోడు: చౌటుప్పల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో పట్టణ ప్రజలతో పాటు, సంస్థాన్ నారాయణపురం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో నేడు 38 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 12 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ […]

Update: 2020-08-18 10:04 GMT

దిశ, మునుగోడు: చౌటుప్పల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో పట్టణ ప్రజలతో పాటు, సంస్థాన్ నారాయణపురం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో నేడు 38 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 12 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

అదేవిధంగా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి డాక్టర్ దీప్తి వెల్లడించారు. బాధిత వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి వారి శాంపిల్స్‌ను పరీక్షలు చేసే ఏర్పాట్లు చేస్తున్నారు వైద్యాధికారులు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కు ధరించి బయటకు రావాలని, ప్రభుత్వం మాస్కులు ధరించని వారిపై జరిమానా విధిస్తున్న కూడా నిర్లక్ష్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News