Oxygen Express : 23 రోజుల్లో 1194 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఓ సరఫరా

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి 23 రోజుల్లోనే 1194 మెట్రిక్ టన్నుల ద్రవరూప వైద్యఆక్సిజన్ ను సరఫరా చేశామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. భారతీయ రైల్వే నిరంతరం కొత్తమార్గాలను అన్వేషిస్తూ దేశానికి సేవలందిస్తోందన్నారు. రాష్ట్రానికి మొదటి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 2న చేరుకోగా, 25వ తేదీ వరకు 14 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లల్లో 70 ట్యాంకర్లలో 1194 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఓ ను రైల్వే […]

Update: 2021-05-25 07:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి 23 రోజుల్లోనే 1194 మెట్రిక్ టన్నుల ద్రవరూప వైద్యఆక్సిజన్ ను సరఫరా చేశామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. భారతీయ రైల్వే నిరంతరం కొత్తమార్గాలను అన్వేషిస్తూ దేశానికి సేవలందిస్తోందన్నారు. రాష్ట్రానికి మొదటి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 2న చేరుకోగా, 25వ తేదీ వరకు 14 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లల్లో 70 ట్యాంకర్లలో 1194 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఓ ను రైల్వే ద్వారా సరఫరా చేశామని వెల్లడించారు.

వైద్య ఆక్సిజన్‌ కంటైనర్‌ ట్యాంకర్‌ రైళ్లతో పాటు ఆర్వోఆర్వో (రోల్‌ ఆఫ్‌ రోల్‌ ఆన్‌) సర్వీసులో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోని ఒడిస్సా, జార్ఖండ్‌, గుజరాత్‌ నుంచి రవాణా చేశామని తెలిపారు. రాష్ట్రాల కోరిక మేరకు వైద్య ఆక్సిజన్‌ సరఫరాను వేగంగా, తక్కువ సమయంలో సజావుగా గ్రీన్‌ కారిడార్లలో రవాణా చేయడానికి రైల్వే సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆక్సిజన్ సరఫరా చేసిన జోన్‌లోని రైల్వే అధికారులు, సిబ్బందిని అభినందించారు. రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగడానికి ఇదే కృషిని కొనసాగించాలని రైల్వే సిబ్బందికి సూచించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..