తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా 117

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా వందకు పైగానే కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. సింగిల్ డిజిట్ నుంచి ట్రిపుల్ డిజిట్‌కి కేసుల సంఖ్య పెరుగుతోంది. లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తున్నా కొద్దీ కొత్త కేసులు వందల్లో పుట్టుకొస్తున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం 117 కొత్త కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారు. కొత్త కేసుల్లో 49 మంది సౌదీ అరేబియా నుంచి వచ్చిన […]

Update: 2020-05-28 11:14 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా వందకు పైగానే కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. సింగిల్ డిజిట్ నుంచి ట్రిపుల్ డిజిట్‌కి కేసుల సంఖ్య పెరుగుతోంది. లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తున్నా కొద్దీ కొత్త కేసులు వందల్లో పుట్టుకొస్తున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం 117 కొత్త కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారు. కొత్త కేసుల్లో 49 మంది సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్రయాణీకులు కాగా, ఇద్దరు వలస కార్మికులని, మిగిలిన 66 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనివారివని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ పేర్కొంది. అయితే ప్రభుత్వ వెబ్‌సైట్ మాత్రం 24 గంటల వ్యవధిలో 158 కొత్త కేసులు వచ్చినట్టు వెల్లడించింది. బుధవారం బులిటిన్‌లో పేర్కొన్న గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నట్టయితే కొత్త కేసులు 117 కాదని, 158 అని లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,256కు చేరుకుంది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 1,908 స్థానికంగా పాజిటివ్‌గా నిర్ధారించినవని, మిగిలిన 348 కేసులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారు, విదేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో వచ్చినవారు అని బులెటిన్ పేర్కొంది. విదేశాల నుంచి వచ్చినవారిలో 143 మంది సౌదీ అరేబియా నుంచి వచ్చినవారని, మరో 30 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారు అని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,345 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా, 67 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 844 యాక్టివ్ కేసులున్నాయి.

Tags:    

Similar News