11ఏళ్ల సింహానికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్

దిశ,వెబ్ డెస్క్ : పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం మనిషి జాతికి సాధరణమే. కానీ జంతువులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తారా? అంటే… నెదర్లాండ్స్ లోని 11 ఏళ్ల ఓ మగ సింహానికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు. వెటర్నరీ డాక్టర్ హెంక్ లూటెన్ ఆధ్వర్యంలో సింహానికి ఈ ఆపరేషన్ చేశారు. హెంక్ లూటెన్ మాట్లాడుతూ.. థార్ అనే 11 ఏళ్ల మగసింహం జూలోని రెండు ఆడ సింహాలతో జతకలసింది. వీటిలో మొదటి దానికి రెండు, రెండో […]

Update: 2021-03-12 00:59 GMT

దిశ,వెబ్ డెస్క్ : పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం మనిషి జాతికి సాధరణమే. కానీ జంతువులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తారా? అంటే… నెదర్లాండ్స్ లోని 11 ఏళ్ల ఓ మగ సింహానికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు. వెటర్నరీ డాక్టర్ హెంక్ లూటెన్ ఆధ్వర్యంలో సింహానికి ఈ ఆపరేషన్ చేశారు.

హెంక్ లూటెన్ మాట్లాడుతూ.. థార్ అనే 11 ఏళ్ల మగసింహం జూలోని రెండు ఆడ సింహాలతో జతకలసింది. వీటిలో మొదటి దానికి రెండు, రెండో దానికి మూడు కూనలు పుట్టాయి. ఇప్పటికే థార్ డీఎన్ఏ తమ జూలో చాలా ఉందని దాని జన్యు సమూహం ఎక్కువగా ఉండాలని మేము కోరుకోవట్లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెళ్లడించారు.

Tags:    

Similar News