వారోత్సవాల వేళ ఎదురుదెబ్బ.. 11 మంది మావోయిస్టులు లొంగుబాటు
దిశ, భద్రాచలం : మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల వేళ మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు చేపట్టిన లోన్ వర్రాటు ప్రచారానికి ఆకర్షితులై డీఏకెఎంఎస్ అధ్యక్షుడు రాంబతి బర్సే సహా 11 మంది మావోయిస్టులు బుధవారం దంతెవాడ ఎస్‌పీ అభిషేక్ పల్లవ్ సమక్షంలో లొంగిపోయారు. రాంబతిపై లక్ష రూపాయల రివార్డు ఉంది. లోన్ వర్రాటు ప్రచారం మేరకు ఇప్పటి వరకు 397 మంది లొంగిపోయినట్లు ఎస్‌పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. మిలీషియా కమాండర్ అరెస్టు.. […]
దిశ, భద్రాచలం : మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల వేళ మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు చేపట్టిన లోన్ వర్రాటు ప్రచారానికి ఆకర్షితులై డీఏకెఎంఎస్ అధ్యక్షుడు రాంబతి బర్సే సహా 11 మంది మావోయిస్టులు బుధవారం దంతెవాడ ఎస్‌పీ అభిషేక్ పల్లవ్ సమక్షంలో లొంగిపోయారు. రాంబతిపై లక్ష రూపాయల రివార్డు ఉంది. లోన్ వర్రాటు ప్రచారం మేరకు ఇప్పటి వరకు 397 మంది లొంగిపోయినట్లు ఎస్‌పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.
మిలీషియా కమాండర్ అరెస్టు..
కటే కళ్యాణ్ ఏరియా మిలీషియా కమాండర్ హండా కర్రాని కూకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోర్జా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు అరెస్టు చేశారు. సుమారు 18 ఏళ్ళుగా మావోయిస్టు సంఘాల్లో పనిచేస్తూ అంచలంచెలుగా ఎదిగి మిలీషియా కమాండర్‌గా పనిచేస్తున్న హండాపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.