అటవీ ప్రాంతాల్లో పోలీసుల గాలింపు.. 11 మంది జూదరులు అరెస్ట్

దిశ, మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, దోమెడ గ్రామపంచాయతీల పరిధిలోని అటవీ ప్రాంతంలో పేకాట, కోడి పందాలు ఆడుతున్న 11 మందిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారినుంచి 7 మోటారు సైకిళ్లు, ఒక ఆటో, రూ.8800 నగదు, ఒక కోడి పుంజును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తాహర్ బాబా తెలిపారు. అనంతరం ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు బ్రాహ్మణపల్లి, దోమెడ అటవీ ప్రాంతంలో గాలింపు చేట్టామన్నారు. ఈ క్రమంలో […]

Update: 2021-10-17 05:53 GMT

దిశ, మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, దోమెడ గ్రామపంచాయతీల పరిధిలోని అటవీ ప్రాంతంలో పేకాట, కోడి పందాలు ఆడుతున్న 11 మందిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారినుంచి 7 మోటారు సైకిళ్లు, ఒక ఆటో, రూ.8800 నగదు, ఒక కోడి పుంజును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తాహర్ బాబా తెలిపారు. అనంతరం ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు బ్రాహ్మణపల్లి, దోమెడ అటవీ ప్రాంతంలో గాలింపు చేట్టామన్నారు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్న కోడం రవీందర్, కోడం సాయిబాబా, సమ్మయ్య, చెంచయ్య, ముఖేష్, రమేష్, హరికృష్ణ, రామారావు, కార్తీక్, రాజు, ఈశ్వర్ అనే పదకొండు మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..