ఖమ్మంలో 11 కరోనా కేసులు
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం జిల్లాలో కేసుల సంఖ్య 210కి చేరింది. జిల్లా వైద్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. వేంనూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మరణించారు. దీంతో ఖమ్మం జిల్లాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 11కి చేరింది. మిగిలిన పది కొత్త కేసుల్లో 9 ఖమ్మం పట్టణంలోని ముస్తాఫానగర్‌లో 2, గాంధీచౌక్‌లో 2, రాపర్తి […]
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం జిల్లాలో కేసుల సంఖ్య 210కి చేరింది. జిల్లా వైద్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. వేంనూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మరణించారు. దీంతో ఖమ్మం జిల్లాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 11కి చేరింది. మిగిలిన పది కొత్త కేసుల్లో 9 ఖమ్మం పట్టణంలోని ముస్తాఫానగర్‌లో 2, గాంధీచౌక్‌లో 2, రాపర్తి నగర్‌లో 01, బీకే బజార్‌లో 01, ఆర్టీసీ కాలనీలో 01, ధన్వాయిగూడెంలో 01, మమతారోడ్‌లో 02 కేసులు నమోదయ్యాయి.