అరవై ఏళ్ళలోపు వారిలోనే మెజారిటీ కేసులు

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడి కోసం రాష్ట్రం మొత్తం మీద 1,085 కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఇందులో హైదరాబాద్ నగరంలోనే 103 ఉన్నాయి. మహబూబ్‌నగర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో సైతం కంటైన్‌మెంట్ జోన్లు గణనీయంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరం కంటే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఎక్కువ జోన్లు ఉన్నాయి. ఇక రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులను విశ్లేషిస్తే రెండొంతులు పురుషుల్లోనే ఉన్నాయి. వయసులవారీగా […]

Update: 2020-07-28 10:01 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడి కోసం రాష్ట్రం మొత్తం మీద 1,085 కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఇందులో హైదరాబాద్ నగరంలోనే 103 ఉన్నాయి. మహబూబ్‌నగర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో సైతం కంటైన్‌మెంట్ జోన్లు గణనీయంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరం కంటే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఎక్కువ జోన్లు ఉన్నాయి. ఇక రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులను విశ్లేషిస్తే రెండొంతులు పురుషుల్లోనే ఉన్నాయి. వయసులవారీగా చూస్తే 21ఏళ్ళ నుంచి 60ఏళ్ళ మధ్య వయసువారిలో 80% కేసులు ఉన్నట్లు తేలింది.

రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో దాదాపు సగం మేర హైదరాబాద్ నగరంలోనే ఉన్నప్పటికీ కంటైన్‌మెంట్ జోన్ల విషయంలో మాత్రం మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాలో ఏకంగా 196 జోన్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని మొత్తం 103 కంటైన్‌మెంట్ జోన్లలో గరిష్టంగా చార్మినార్ ప్రాంతంలో 31, సికింద్రాబాద్ ప్రాంతంలో 23, ఖైరతాబాద్‌లో 15, శేరిలింగంపల్లిలో 10, కూకట్‌పల్లిలో 9, ఎల్బీ నగర్‌లో ఐదు చొప్పున ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించే ఉద్దేశంతో తయారుచేసిన హెల్త్ బులెటిన్‌లో ఈ వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పొందుపరిచారు.

అరవై ఏళ్ళలోపు వారిలోనే మెజారిటీ కేసులు

రాష్ట్రం మొత్తం మీద నమోదైన కరోనా పాజిటివ్ కేసులను విశ్లేషించిన ప్రజారోగ్య శాఖ 21 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారిలో 80% మేర కరోనా ఉన్నట్లు తేల్చింది. మొత్తం కేసుల్లో పురుషులు మూడింట రెండు వంతులుగా ఉన్నట్లు తేల్చింది. ఇరవై ఏళ్ళ లోపు వయసు ఉన్నవారిలో 8.7% కేసులు మాత్రమే ఉన్నట్లు తేలింది.
పదేళ్ళ లోపువారు – 3.4%
ఇరవై ఏళ్ళ లోపువారు – 5.3%
30 ఏళ్ళ లోపువారు – 22.1%
40 ఏళ్ళ లోపువారు – 25%
50 ఏళ్ళ లోపువారు – 18.6%
60 ఏళ్ళ లోపువారు – 14.7%
70 ఏళ్ళ లోపువారు – 7.5%
80 ఏళ్ళ లోపువారు – 2.6%
80 ఏళ్ళు పైబడినవారు – 0.6%

Tags:    

Similar News