24 గంటల్లో 380 మరణాలు

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా కేసులు పెరగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ నెల 1వ తేదీన మొదలైన అన్‌ లాక్‌డౌన్ సమయానికి దేశం మొత్తం మీద 1.82 లక్షల కేసులు ఉంటే జూన్ 16 నాటికి అది మూడున్నర లక్షలకు చేరువైంది. మృతుల సంఖ్య సైతం 1వ తేదీ నాటికి 5,164 ఉంటే మంగళవారం నాటికి అది పది వేలకు చేరువైంది. సడలింపులు పెరుగుతున్నాకొద్దీ అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ […]

Update: 2020-06-16 11:54 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా కేసులు పెరగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ నెల 1వ తేదీన మొదలైన అన్‌ లాక్‌డౌన్ సమయానికి దేశం మొత్తం మీద 1.82 లక్షల కేసులు ఉంటే జూన్ 16 నాటికి అది మూడున్నర లక్షలకు చేరువైంది. మృతుల సంఖ్య సైతం 1వ తేదీ నాటికి 5,164 ఉంటే మంగళవారం నాటికి అది పది వేలకు చేరువైంది. సడలింపులు పెరుగుతున్నాకొద్దీ అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ సహా కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా స్థానిక వ్యాప్తి బలంగా ఉందన్న అనుమానంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలన్న నిర్ణయించారు. స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి రోజుకు 18 వేల చొప్పున ఢిల్లీ నగరంలో కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆదేశించారు. తెలంగాణలో సైతం నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరుగుతోంది. ఇంతకాలం ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద అనుమతి ఇచ్చింది. తొలి రోజే రెండున్నర వేల టెస్టులు ప్రైవేటు ల్యాబ్‌ల్లో జరిగాయి.

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,667 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,091కు చేరుకుంది. ఒక్కరోజే కరోనాతో 380 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,900కి చేరింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను సడలించడంతో డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరిగి యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటివరకు 1,80,013 మంది కోలుకోగా 1,53,178 మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. మహారాష్ట్రలో ఒక్కరోజే 2,701పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఆ రాష్ట్రంలో 1,13,445కి చేరింది.

తమిళనాడులో ఒక్కరోజే 1,515 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య48,019కి చేరింది. మృతుల సంఖ్య 528కి చేరింది. గుజరాత్‌లో ఒక్కరోజే 524 కొత్త పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 24,628కి చేరింది. ఇక్కడ ఒక్కరోజే 28 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 534కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 193 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 5,280కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 88 మంది మరణించారు.

Tags:    

Similar News