24 గంటల్లో 1000కి పైగా పాజిటివ్ కేసులు
భారత్‌లో కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో తొలిసారిగా ఒక్క రోజులోనే పాజిటివ్ కేసుల నమోదు 1000 దాటింది. శనివారం ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 1,035 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 40 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 242కు చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,529 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలోని 486 ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స […]
భారత్‌లో కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో తొలిసారిగా ఒక్క రోజులోనే పాజిటివ్ కేసుల నమోదు 1000 దాటింది. శనివారం ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 1,035 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 40 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 242కు చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,529 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలోని 486 ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందుతోందని, లక్షకు పైగా ఐసొలేషన్ పడకలు, 11,836 ఐసీయూ పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
17 రాష్ట్రాల్లోని 71 జిల్లాల్లో మాత్రమే 80 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారిలో కొందరూ ఇంకా అజ్ఞాతంలోనే ఉండి, కరోనా పరీక్షలకు ముందుకు రావడం లేదన్నారు. వారి ఆచూకీ చెబితే, రూ. 5 వేల రివార్డు ఇస్తామని మంత్రి ప్రకటించారు.
Tags: corona, india, 1035 positive case registered, national news