30 సెకన్లలో 101 గెంతులు.. గిన్నిస్ రికార్డు!

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. కాదేదీ గిన్నిస్ రికార్డుకు అనర్హం అనొచ్చునేమో. ఎందుకంటే.. సాధారణంగా చేసే పనులనే కొంచెం విభిన్నంగా, వైవిధ్యంతో పాటు వేగంగా చేసేస్తే రికార్డు లభిస్తుంది. కానీ చెప్పినంత సులభం కాదు చేయడమంటే.. అని దుబాయ్‌లో ఉండే ఈ భారతీయ కుర్రాడు చేసిన పని చూస్తే తెలుస్తోంది. గెంతులు అందరూ గెంతుతారు, కానీ ఎంతమంది రికార్డుకెక్కే స్థాయిలో గెంతగలరు? అలాంటి గెంతులను వేగంగా చేసి అంటే.. 30 సెకన్లలో 101 గెంతులు పూర్తి చేసి […]

Update: 2020-07-13 02:25 GMT

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. కాదేదీ గిన్నిస్ రికార్డుకు అనర్హం అనొచ్చునేమో. ఎందుకంటే.. సాధారణంగా చేసే పనులనే కొంచెం విభిన్నంగా, వైవిధ్యంతో పాటు వేగంగా చేసేస్తే రికార్డు లభిస్తుంది. కానీ చెప్పినంత సులభం కాదు చేయడమంటే.. అని దుబాయ్‌లో ఉండే ఈ భారతీయ కుర్రాడు చేసిన పని చూస్తే తెలుస్తోంది. గెంతులు అందరూ గెంతుతారు, కానీ ఎంతమంది రికార్డుకెక్కే స్థాయిలో గెంతగలరు? అలాంటి గెంతులను వేగంగా చేసి అంటే.. 30 సెకన్లలో 101 గెంతులు పూర్తి చేసి ‘సోహమ్ ముఖర్జీ’ గిన్నిస్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు 30 సెకన్లలో 96 గెంతులుగా ఉండేది. ఇప్పుడు దీన్ని సోహమ్ ముఖర్జీ బద్దలుకొట్టాడు.

తన బెడ్‌రూమ్‌లో ఫ్లోర్ మీద ఒక పెద్ద స్కేల్ ఉంచి, దాని మీది నుంచి అటు ఇటు గెంతుతూ మొత్తం 110 సార్లు గెంతాడు. అయితే వీటిలో 9 గెంతులు లెక్కకురాలేదు. కాబట్టి 101 గెంతులతో రికార్డును నెలకొల్పగలిగాడు. రెండు కెమెరాలతో క్లోజ్ అప్ స్లో మోషన్ మోడ్ ఆన్ చేసి తన గెంతులను రికార్డు చేసినట్లు ముఖర్జీ తెలిపాడు. దుబాయ్‌లో వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న ముఖర్జీ.. ఈ రికార్డు సాధించడానికి తను లాక్‌డౌన్ సమయాన్ని వినియోగించుకుని మరింత అంకితభావంతో ప్రాక్టీసు చేసినట్లు వివరించాడు.

Tags:    

Similar News