ఒక్కరోజే 10 వేల కొవిడ్ కేసులు

దిశ వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్‌లో కొవిడ్ కేసులు విజృంభించాయి. మంగళవారం జరిపిన పరీక్షల్లో దాదాపు 10 వేల కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది జనవరి తరువాత ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. దేశం మొత్తం మీద లక్షా యాభై వేల పరీక్షలు చేయగా కొత్త కేసులు భారీగా నమోదయినట్లు తెలుస్తోంది. కొవిడ్ కేసుల పెరుగుదలపై ఇప్పటికే అప్రమత్తమైన బెన్నెట్ సర్కార్ భారీగా బూస్టర్ డోసులు ఇవ్వటంతో పాటు టెస్ట్‌ల సంఖ్యను సైతం భారీగా […]

Update: 2021-08-24 11:58 GMT

దిశ వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్‌లో కొవిడ్ కేసులు విజృంభించాయి. మంగళవారం జరిపిన పరీక్షల్లో దాదాపు 10 వేల కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది జనవరి తరువాత ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. దేశం మొత్తం మీద లక్షా యాభై వేల పరీక్షలు చేయగా కొత్త కేసులు భారీగా నమోదయినట్లు తెలుస్తోంది. కొవిడ్ కేసుల పెరుగుదలపై ఇప్పటికే అప్రమత్తమైన బెన్నెట్ సర్కార్ భారీగా బూస్టర్ డోసులు ఇవ్వటంతో పాటు టెస్ట్‌ల సంఖ్యను సైతం భారీగా పెంచినట్లు సమాచారం.

ఇంతకు ముందే దేశంలో మాస్క్‌ నిబంధనలు తిరిగి ప్రవేశపెట్టిన టెల్ అవీవ్, కేసుల సంఖ్య పెరగటంతో పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. కాగా ఈ రోజు ఒక్కరోజే 12 మంది ప్రజలు మరణించినట్లు తెలుస్తోంది. కాగా, 678 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. దేశంలో దాదాపు 6.63శాతం పాజిటివి రేట్‌తో కేసులు నమోదు అవుతున్నాయని గణాంకాలు స్ఫష్టం చేస్తున్నాయి. ఏదైన దేశంలో పాజిటివిటి రేట్ రెండుకు మించితే దాన్ని వేవ్‌గా పరిగణిస్తారు. అలాంటిది 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ఇజ్రాయెల్‌లో దాదాపు 6శాతం పాజిటివిటి రేట్‌తో కేసులు నమోదు కావటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News