గోవా, బెంగాల్ మ్యాచ్ డ్రా..
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా బుధవారం రాత్రి గోవాలోని తిలక్ మైదాన్‌లో ఈస్ట్ బెంగాల్ కల్బ్, గోవా ఫుట్‌బాల్ క్లబ్‌కు జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. 23వ నిమిషంలో గోవాకు కార్నర్ లభించినా ఈస్ట్ బెంగాల్ డిఫెండర్స్ సమర్దవంతంగా అడ్డుకున్నారు. 36వ నిమిషంలో గోవాకు ఫైన్ లభించింది. కానీ ఈస్ట్ బెంగాల్ దాన్ని గోల్ కాకుండా కాపాడుకున్నది. ఆ […]
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా బుధవారం రాత్రి గోవాలోని తిలక్ మైదాన్‌లో ఈస్ట్ బెంగాల్ కల్బ్, గోవా ఫుట్‌బాల్ క్లబ్‌కు జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. 23వ నిమిషంలో గోవాకు కార్నర్ లభించినా ఈస్ట్ బెంగాల్ డిఫెండర్స్ సమర్దవంతంగా అడ్డుకున్నారు. 36వ నిమిషంలో గోవాకు ఫైన్ లభించింది. కానీ ఈస్ట్ బెంగాల్ దాన్ని గోల్ కాకుండా కాపాడుకున్నది. ఆ తర్వాత ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించినా విఫలమయ్యాయి. ఇక రెండో అర్దభాగంలో కూడా గోల్స్ సాధించడం కష్టంగా మారింది.
అయితే 79వ నిమిషంలో ఈస్ట్ బెంగాల్ ఆటగాడు బ్రైట్ ఎనోభకారే గోల్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కానీ ఆ ఆధిక్యత ఎంతో సేపు నిలవలేదు. మరో రెండు నిమిషాల్లోనే గోవా ఆటగాడు సేవియర్ గామా ఇచ్చిన పాస్‌ను దేవేంద్ర గోల్‌గా మలిచాడు. దీంతో స్కోర్ 1-1గా సమం అయ్యింది. మిగిలిన సమయంలో ఇరుజట్లు గోల్స్ చేయలేకపోయాయి. నిర్ణీత సమయం తర్వాత 1-1 గోల్స్‌తో మ్యాచ్‌ను డ్రాగా ముగించాయి. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు సేవియర్ గామా, హీరో ఆఫ్ ది అవార్డు బ్రైట్‌కు దక్కాయి.