శరీరంలో అధిక వేడితో బాధ పడుతున్నారా..
దిశ,వెబ్‌డెస్క్ : ప్రస్తతం చాలా మంది శరీరంలో అధిక వేడివలన బాధ పడుతూ ఉంటున్నారు. అయితే అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే అధిక వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. మనం రోజు తీసుకునే ఆహారపు అలవాట్ల వలన మన శరీరంలో వేడి అనేది ఉంటుంది. దీని కారణంగా మలబద్ధకం, తలనొప్పి లాంటి సమస్యలు అధిక వేడి ఉన్న వారిని వేధిస్తుంటాయి. అయితే ఈ అధిక వేడి నుంచి ఉపశమనం పొందడాని చిట్కాలు చూద్దాం […]
దిశ,వెబ్‌డెస్క్ : ప్రస్తతం చాలా మంది శరీరంలో అధిక వేడివలన బాధ పడుతూ ఉంటున్నారు. అయితే అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే అధిక వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. మనం రోజు తీసుకునే ఆహారపు అలవాట్ల వలన మన శరీరంలో వేడి అనేది ఉంటుంది. దీని కారణంగా మలబద్ధకం, తలనొప్పి లాంటి సమస్యలు అధిక వేడి ఉన్న వారిని వేధిస్తుంటాయి. అయితే ఈ అధిక వేడి నుంచి ఉపశమనం పొందడాని చిట్కాలు చూద్దాం
అధిక వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించండి…
1. మనం రోజు తీసుకునే ఆహారపు అలవాట్లలో చికెన్, టీ లాంటివి.. వేడి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు.
2. ఎక్కువగా నీరు లేదా ఏదైనా చల్లటి ద్రావణాలను తాగాలి. దీనివలన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది.
3. విటమిన్-సి అధికంగా ఉండే పళ్లను తీసుకోవాలి.
4. గాలి ఎక్కువగా ఉన్న చోట కూర్చోవాలి. లేకపోతే తగినంత ఆక్సిజన్ అందక శరీరంలో మార్పులు చోటు చేసుకుని శరీర ఉష్ణోగ్రత పెరిగినట్లు అనిపిస్తుంది. కొన్ని సమయాల్లో కళ్లుతిరిగి పడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
5. అలాగే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, తీసుకోవడం మంచిది.
6. వేడి తగ్గాలంటే అన్నంతో పాటు, సాంబారు, రసం తీసుకోవడం వలన శరీరంలో ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంది.
7. వేడి నుంచి ఉపశమనం పొందడానికి పుచ్చకాయ, కర్భూజా, ద్రాక్ష లాంటి పండ్లు తీసుకోవాలి.
8. ఒక టీస్పూన్ మెంతుల్ని తినడం, నీళ్లలో కలుపుకుని తాగడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది.
9. రోజు ఉదయాన్నే దాన్నిమ్మ జ్యూస్ తాగాలి.
10. పల్చటి మజ్జిగలో నిమ్మరసం ఉప్పు వేసి తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది.