సోషల్ మీడియా వ్యసనం : 1.54 మిలియన్ల మంది ఆత్మహత్య
దిశ వెబ్ డెస్క్ : సోషల్ మీడియా పాగల్ బన్ గయా. అవును ముమ్మాటికి ఈ మాట నిజమనే అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం. వీడియోలు షేర్ చేయడం. కామెంట్ల కోసం వెంపర్లాడడం. లైకుల కోసం కాలం గడిపేయడం. ఇదే దినచర్యగా మారింది. కొందరికైతే ఇదే ధ్యాస తప్ప మరొకటి లేదన్నట్లుగా తయారైంది. ఓ రకంగా చెప్పాలంటే క్రేజ్ కాస్త పిచ్చిగా మారింది. […]
దిశ వెబ్ డెస్క్ : సోషల్ మీడియా పాగల్ బన్ గయా. అవును ముమ్మాటికి ఈ మాట నిజమనే అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం. వీడియోలు షేర్ చేయడం. కామెంట్ల కోసం వెంపర్లాడడం. లైకుల కోసం కాలం గడిపేయడం. ఇదే దినచర్యగా మారింది. కొందరికైతే ఇదే ధ్యాస తప్ప మరొకటి లేదన్నట్లుగా తయారైంది. ఓ రకంగా చెప్పాలంటే క్రేజ్ కాస్త పిచ్చిగా మారింది. అడ్డగోలు రాతలు. అసత్య ప్రచారాలు. అసభ్యకర ట్రోలింగ్స్‌తో సోషల్ మీడియా యార్డ్‌లను డంప్ యార్డ్‌లా మారుస్తున్నారు కొందరు. మనిషి బ్రతికుండగానే చనిపోయినట్లు రిప్ పోస్ట్‌లు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కామెంట్లు. కులాల మధ్య చిచ్చుపెట్టే ఫోటోలు వెరసీ 2020లో సుమారు 1.54 మిలియన్ల మంది మరణాలకు కారణమైంది. అందుకే WHO సైతం బతుకుంటే బలుసాకైనా తినొచ్చు కానీ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తుంది.
సోషల్ మీడియా వినియోగం ప్రారంభం
1996లో తొలిసారిగా బోల్ట్ పేరుతో వీడియోల్ని స్టోర్ చేసుకునేలా వీలూ కల్పిస్తూ వెబ్ సైట్ విడుదలైంది. యునైటెడ్ నేషన్ (యూఎన్) లెక్కల ప్రకారం.. ప్రపంచ 5.77 బిలియన్ మందిలో సగం మంది సోషల్ మీడియాను వినియోగించారు. నాడు మొదలైన సోషల్ మీడియా వినియోగం 2010 సంవత్సరానికి మూడింతలు పెరిగింది. 2010లో నెటిజన్ల సంఖ్య 970మంది మిలియన్లు ఉండగా.. అంచలంచెలుగా పెరుగుతూ 2020కి వారి సంఖ్య 3.81 బిలియన్ల యూజర్లు పెరిగిపోయారు.
పెరిగిపోతున్న ఆత్మహత్యలు
సోషల్ మీడియాను వినియోగించే వారు ఆత్మహత్య చేసుకోవాలనే థాట్స్ ఎక్కవవుతున్నట్లు తెలుస్తోంది. 2020లో 1.54 మిలియన్ల మంది ఆత్మహత్యలకు సోషల్ మీడియా కారణమని WHO చెబుతోంది. నెటిజన్లు సోషల్ మీడియాలో గంటల తరబడి గడపడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అనారోగ్య సమస్యలతో పాటు ఆత్మహత్య చేసుకోవాలనే ధోరణి పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో గంటల తరబడి టైం స్పెండ్ చేస్తూ షేర్లు, లైకుల రాకపోవడంతో సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ఈజీ మనీకోసం బ్లాక్ మెయిలింగ్, సైబర్ దాడులు, హత్యలు చేసేలా సోషల్ మీడియా పోస్ట్ లు ప్రేరేపిస్తున్నట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.
లాభం ఎంతో నష్టం కూడా అంతే
బెంగళూరుకి చెందిన ఓ వ్యక్తి తన వ్యతిరేక వర్గాన్నిటార్గెట్ చేస్తూ పోస్ట్ వల్ల సుమారు కోట్లలో ఆస్తినష్టంతో పాటు ఐదుగురు ప్రాణాల్ని తీసుకుంది. అదే సోషల్ మీడియా ఎంతోమందికి అండగా నిలిచింది. ఉదాహరణకు ఢిల్లీలోని బాబా కా దాబా యజమానికి ఎంతమేలు చేసిందో మనందరికి తెలిసిందే. కరోనా కారణంగా ఎంతోమంది నిరుద్యోగులు, మహిళలు, విద్యార్ధులకు ఉపాధిగా మారింది.