పాఠశాలకు రాకుండానే హాజరు.. వంటమనిషి చేత చదువులు

Latest Telugu News

Update: 2022-04-08 10:11 GMT

దిశ, రాయికల్: మండలంలోని మైతాపూర్ గ్రామ బుడిగె జంగం కాలనీకి చెందిన ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న సరిత అనే ఉపాధ్యాయురాలు పాఠశాల విధులకు సరిగా హాజరు కాకుండానే నిత్యం పాఠశాలకు వస్తున్నట్లు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు పెడుతుంది.. అంతేకాదు పాఠశాలలో వంటమనిషిగా పనిచేసే లిఖిత అనే కార్మికురాలితో విద్యార్థులకు చదువు చెప్పిస్తుందని, క్షేత్ర స్థాయిలో విచారణ చేసి ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తప్పించాలని కోరుతూ ఎంపీటీసీ రాజనాల మధు కుమార్ శుక్రవారం మండల విద్యా వనరుల కేంద్రంలో ఫిర్యాదు చేశారు. గతంలోను ఆ ఉపాధ్యాయురాలిపై పలువురు ఫిర్యాదు చేసారని, రాజకీయ పలుకుబడితో తమను బెదిరిస్తున్నట్లు ఎంపీటీసీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనతో పాటుగా బీజేపీ మండల అధ్యక్షుడు అన్నవేని వేణు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు తొగిట్టి లక్ష్మీనారాయణ, మైతాపూర్ దేవాలయ కమిటీ అధ్యక్షుడు నర్రా రాజు రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు దుంపల రాజ రెడ్డి, బీజేపీ నాయకులు సతీష్, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News