రిలాక్స్ అయితే రిగ్రెట్ తప్పదు : అమితాబ్

by Shyam |
రిలాక్స్ అయితే రిగ్రెట్ తప్పదు : అమితాబ్
X

దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావంతో మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు అత్యధిక సంఖ్యలో నమోదు కాగా లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేయాల్సి వచ్చింది. అయితే కొద్దిరోజులుగా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో కొవిడ్ ప్రొటోకాల్స్‌ను జనాలు లైట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన బిగ్ బీ.. ‘కొన్ని ప్రదేశాల్లో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. ప్రొటోకాల్స్ విషయంలో అప్పుడే రిలాక్స్ కాకూడదు’ అని తెలిపారు. చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మరిచిపోవద్దని గుర్తుచేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని, టైమ్ లిమిట్స్ పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఫ్రంట్‌లైన్ వర్కర్స్, స్వచ్ఛంద సంస్థల సేవలను కొనియాడిన అమితాబ్.. పాండమిక్ టైమ్‌లో ప్రతీ ఒక్కరు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. అప్పుడే ఈ మహమ్మారి నుంచి అందరం సేఫ్‌గా బయటపడతామన్నారు బచ్చన్ జీ.

Advertisement

Next Story

Most Viewed