ప్రత్యేక ఆర్మీ చట్టాలు వద్దు.. నిరసనలో అమిత్‌షా దిష్టిబొమ్మ దగ్దం

by Shamantha N |
nagaland
X

కోహిమా: నాగాలాండ్ పౌరుల హత్యపై వెంటనే న్యాయం చేయాలని స్థానిక కొన్యాక్ యూనియన్ ఉపాధ్యక్షుడు హోనాంగ్ కొన్యాక్ అన్నారు. తమకు సానుభూతి కాకుండా ఘటనపై న్యాయం కావాలని డిమాండ్ చేశారు. దీంతో సైన్యం ప్రత్యేక అధికారాలను కూడా రద్దు చేయాలని నొక్కి చెప్పారు. పౌర హత్యలను వ్యతిరేకిస్తూ వందల సంఖ్యలో ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు.

కేంద్ర మంత్రి అమిత్ షా ఈ వారం పార్లమెంటులో జరిగిన సంఘటనపై తన తప్పడు ప్రకటనపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనగా అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే అమిత్ షా తన వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఆయన తన వ్యాఖ్యలతో ప్రపంచానికి తప్పుడు సమాచారమిచ్చారని అన్నారు. మరణించిన 14 మందికి న్యాయం జరిగే వరకు విశ్రాంతి తీసుకోమని ఉద్ఘాటించారు. కాగా ప్రత్యేక ఆర్మీ అధికారాలను రద్దు చేయాలని నాగాలాండ్ సీఎం రియోతో పాటు విపక్ష నేత కన్రాడ్ సంగ్మా కూడా కోరారు.

Advertisement

Next Story