- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచిత అంబులెన్స్ సర్వీసు వారి కోసమే: జగ్గారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : పేదల కోసమే అంబులెన్స్ లు ఏర్పాటు చేసి ఉచిత సర్వీసు అందజేస్తున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబులెన్స్ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లితండ్రుల జ్ఞాపకార్థంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జీ మాణిక్కం ఠాగూర్, జిల్లా ఇన్ ఛార్జ్, ఏఐసీసీ సెక్రటరీ బోసు రాజు ఆదేశాల మేరకు సంగారెడ్డి ప్రజల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేశానన్నారు. మొత్తం 15 అంబులెన్స్ లకు గాను ప్రస్తుతం 2 అంబులెన్స్ లను ఏర్పాటు చేశానని, త్వరలోనే మిగతావి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతానికి ఒకటి సంగారెడ్డి టౌన్ లో మరొకటి సదాశివపేటలో అందుబాటులో ఉంటాయని, అవసరం ఉన్న వారు క్యాంపు ఆఫీసు 08455-278355కి ఫోన్ చేయాలని కోరారు. ప్రతి మండలానికి ఒకటి, మున్సిపాలిటీ లకు రెండుచొప్పున ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి గ్రామానికి అంబులెన్స్ చేరుకునేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అంబులెన్స్ లు ఏర్పాటు చేయగానే ఫోన్ నెంబర్లు తెలియచేస్తామని వెల్లడించారు. ఇది రాజకీయం కోసం కాదని, చాలా రోజుల నుంచి తల్లిదండ్రుల పేరు మీద సర్వీస్ చేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు ఎవరు ఇబ్బంది పడొద్దని ఈ ఉచిత అంబులెన్స్ సర్వీస్ లు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కరూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.