చౌటుప్పల్‌లో అమానుషం.. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

by Shyam |
Ambedkar statue
X

దిశ, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అవమానం జరిగింది. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శనివారం నిరసన తెలిపారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం చౌటుప్పల్ ఆర్డీఓ, ఎమ్మార్వో, ఏసీపీ, సీఐలకు వినతిపత్రం సమర్పించారు.

విగ్రహ ధ్వంసానికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి ఇరువైపులా రోడ్డు వెడల్పు చేసి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు స్వామినాథం, వార్డు కౌన్సిలర్ కొరగాని లింగస్వామి, పుర్రు యాదయ్య, ఆరుట్ల యాదయ్య, ఆరుట్ల లింగస్వామి, యాదయ్య, స్వామి, శ్యామ్, శంకర్, నరేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story